Jana Nayagan: దళపతి విజయ్ జననాయగన్ పోస్ట్‌పోన్ కావడం పక్కా అంటూ కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సెన్సార్ పరమైన చిక్కుల కారణంగా తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ బుధవారం కూడా ఓపెన్ కాలేదు. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సెన్సార్ జాప్యంపై నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. నిర్మాతల పిటీషన్‌పై బుధవారం విచారణ జరిగింది. తీర్పును మాత్రం శుక్రవారానికి మద్రాస్ హైకోర్టు వాయిదా వేసింది. శుక్రవారం రోజే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కోర్టు తీర్పు వాయిదా నేపథ్యంలో జననాయగన్‌ను పోస్ట్‌పోన్ చేయడం మినహా మేకర్స్‌కు మరో మార్గం లేనట్లు సమాచారం.
మార్నింగ్ షోస్ క్యాన్సిల్?
నిర్మాతల పిటీషన్‌పై మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఉదయం తీర్పు ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మేకర్స్‌కు అనుకూలంగా తీర్పు వస్తే మార్నింగ్ షోస్ కాకుండా మ్యాట్నీ నుంచి జననాయగన్‌ను రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తీర్పు వ్యతిరేకంగా వస్తే మాత్రం పోస్ట్‌పోన్ చేయడం తప్ప మరో ఛాయిస్ ఉండదు. దాంతో కోర్టు తీర్పు ఎలా వస్తుందన్నది దళపతి విజయ్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Also Read – Sankranti Special Buses: టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్.. సంక్రాంతికి 6 వేలకు పైగా స్పెషల్ బస్సులు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగ్స్…
జననాయగన్‌లో తమిళనాడు అధికార పార్టీపై వ్యతిరేకంగా డైలాగ్స్ ఉన్నాయని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ తీరును విమర్శిస్తూ విజయ్ చెప్పిన కొన్ని డైలాగ్స్‌పై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిందట. వాటిని తొలగించమని మేకర్స్‌ను కోరినట్లు సమాచారం. నిర్మాతలు మాత్రం అందుకు ఒప్పుకోకుండా కోర్టును ఆశ్రయించినట్లు చెబుతోన్నారు.
కాగా దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న చివరి సినిమా ఇది. జననాయగన్ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు దళపతి విజయ్ ఇటీవలే ప్రకటించారు. తెలుగు మూవీ భగవంత్ కేసరికి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మమితా బైజు కీలక పాత్ర పోషిస్తుంది. బాడీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు.
US warning: నిబంధనలు ఉల్లంఘిస్తే డిపోర్ట్ చేస్తాం.. భారత విద్యార్థులకు అమెరికా హెచ్చరికలు

