Saturday, July 12, 2025
Homeచిత్ర ప్రభAnil Ravipudi: మెగా కాంపౌండ్ లో అనిల్ రావిపూడి జైత్రయాత్ర కొనసాగేనా?

Anil Ravipudi: మెగా కాంపౌండ్ లో అనిల్ రావిపూడి జైత్రయాత్ర కొనసాగేనా?

Chiranjeevi: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్క హీరోకి మంచి కమర్షియల్ హిట్ ఇస్తే ఇక అందరూ ఆ దర్శకుడి వెనకాలే క్యూ కడతారు. ఇంకోరకంగా చెప్పాలంటే మిగతా హీరోలంతా ఆ దర్శకుడి మీద కర్చీఫ్స్ వేస్తారు. మన తెలుగులో అక్కినేని ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీస్ ఉన్నాయి. అయితే మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలు ఎక్కువ. మెగా ఫ్యామిలీ హీరోకి గనక ఒక్క హిట్ ఇస్తే మిగతావాళ్ళ కోసం కథ తయారు చేసుకోమని స్వయంగా చిరునే ఆఫర్ ఇస్తారు.

- Advertisement -

ప్రస్తుతం మెగా హీరోల ఫోకస్ ప్రత్యేకించి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మీదే ఉంది. ఆయన ఇప్పటికే మెగా హీరోలిద్దరికీ సూపర్ హిట్స్ ఇచ్చారు. అనిల్ రావిపూడి రెండవ సినిమానే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్‌తో చేసి హిట్ ఇచ్చారు. అంతేకాదు, ఇందులో ‘అందం హిందోళం’ సాంగ్ రీమిక్స్ చేయడం కూడా ఆసక్తికరం. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ఎఫ్ 2, ఎఫ్ 3 మల్టీస్టారర్ చిత్రాలు తీసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఈ సినిమాలలో వెంకటేశ్ తో కలిసి వరుణ్ చేసిన సీన్స్ థియేటర్స్‌లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/do-you-recognize-the-child-artist-in-this-photo-yes-its-none-other-than-aishwarya-rajesh/

ఇలా అనిల్ రావిపూడి ఇద్దరు మెగా యంగ్ హీరోలతో సినిమాలు బ్లాక్ బస్టర్స్ ఇవ్వగా, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో మెగా 157 ని తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ ని ముస్సోరీలో సెకండ్ షెడ్యూల్ ని పూర్తి చేశారు అనిల్ రావిపూడి. ఇప్పటి చేసిన సినిమాలకంటే వేగంగా మెగా 157 షూటింగ్‌ని పూర్తి చేస్తున్నారు అనిల్. 2026 సంక్రాంతి పండుగకి రఫ్ఫాడిద్దాం అంటూ అభిమానులను ఊరిస్తున్నారు. ఆ దిశగానే శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసేస్తున్నారు. ఇంత స్పీడ్‌గా పూరి జగన్నాధ్ సినిమా తీసేవారు. అనిల్ ఆయనకంటే వేగంగా తీస్తున్నారని తాజాగా ముస్సోరీలో పూర్తైన షెడ్యూల్ చూసి అంటున్నారు.

మెగా 157 లో నయనతార చిరంజీవికి జోడీగా నటిస్తున్నారు. సాహుగారపాటి, మెగా డాటర్ సుష్మిత కొణిదెల కలిసి నిర్మిస్తున్నారు. అయితే, ఇప్పుడు అనిల్ రావిపూడి పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేస్తే చూడాలని మెగా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలలో ఒక్క ఉస్తాద్ భగత్‌సింగ్ మాత్రమే పూర్తి చేయాల్సి ఉంది. అనిల్ గనక పవర్ స్టార్ కి తగ్గ కథ చెప్పి ఒప్పిస్తే ప్రాజెక్ట్ పట్టాలెక్కడం పెద్ద కష్టమేమీ కాదు. అనిల్ మైండ్ లో పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే ఆలోచన ఉండకపోదు. కానీ, అన్నీ కుదరాలి. వీరి కాంబోలో సినిమా ఓకే అయితే మాత్రం బాక్సులన్నీ బద్దలవుతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News