Wednesday, January 14, 2026
Homeచిత్ర ప్రభJanhvi Kapoor: పెద్ది తో హిట్ కొడితే టాలీవుడ్‌లో జాన్వీనే నంబర్ 1 హీరోయిన్?

Janhvi Kapoor: పెద్ది తో హిట్ కొడితే టాలీవుడ్‌లో జాన్వీనే నంబర్ 1 హీరోయిన్?

Janhvi Kapoor: పెద్ది సినిమా మీద జాన్వీ కపూర్ సౌత్‌లో మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో కెరీర్ ఆధారపడి ఉందనేది ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్న మాట. అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ధడక్ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై మంచి మార్కులే తెచ్చుకుంది. వాస్తవానికి, బోనీకపూర్ జాన్వీని ముందు సౌత్‌లో పరిచయం చేయాలనుకున్నాడు.

- Advertisement -

తమిళంలో కొన్ని సినిమాలకి హీరోయిన్‌గా అనుకున్నారు కూడా. అజిత్ హీరోగా బోనీ తమిళంలో హిట్ సినిమాలను నిర్మించాడు. ఆ సమయంలో అనుకున్నప్పటికీ సరైన కథ దొరకలేదు. ఇక, తెలుగులో చాలామంది హీరోలకి జాన్వీని అనుకున్నారు. కానీ, సరైన లాంచింగ్ కోసం ఎదురుచూసిన బోనీకపూర్.. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమాతో ఎంట్రీ ప్లాన్ చేశారు. ఈ సినిమా జాన్వీకి అంతగా కలిసిరాలేదనే టాక్ వినిపించింది.

Also Read – The Rajasaab: ది రాజాసాబ్‌లో ముగ్గురు హీరోయిన్స్ ఎందుకు..? మారుతిపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

దేవర సినిమా జాన్వీకి పర్ఫార్మెన్స్ పరంగా మంచి గుర్తింపు తెచ్చింది కానీ, స్టార్ హీరోయిన్ రేంజ్ మాత్రం తేలేదు. అయితే, ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పెద్దిలో ఛాన్స్ వచ్చింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి చరణ్ లుక్ రిలీజైయ్యాక ఒక్కసారిగా సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగింది. ఫస్ట్ షాట్ వచ్చాక అంచనాలు బాగా పెరిగాయి.

అయితే, ఇంత మాస్ కథ.. విలేజ్ బ్యాక్‌డ్రాప్ కావడంతో జాన్వీ కపూర్ లాంటి క్లాస్ హీరోయిన్‌ని ఎలా చూపిస్తాడో బుచ్చిబాబు.. అసలు సూటవుతుందా ఇలాంటి సినిమాకి? అనే సందేహాలు మొదలయ్యాయి. కానీ, బుచ్చిబాబు.. అచ్చియమ్మ పాత్రలో జాన్వీ ఫస్ట్ లుక్ ని ఆ తర్వాత చికిరి చికిరి సాంగ్‌లో జాన్వీ యాటిటూడ్‌ను చూశాక..అందరూ ఒకింత షాకయ్యారు. జాన్వీ మేకోవర్ సూపర్బ్ అని చెప్పుకున్నారు. దీంతో, జాన్వీకి పెద్ది మూవీతో హిట్ దక్కితే, టాలీవుడ్‌లో గ్యారెంటీగా నంబర్ 1 హీరోయిన్ తనే అని మాట్లాడుకుంటున్నారు. మరి, బుచ్చిబాబు అచ్చియమ్మగా జాన్వీ పాత్రను ఎంత బలంగా చూపించి క్రెడిట్ ఇస్తాడో చూడాలి.

Also Read – Jana Nayagan: ‘జన నాయగన్’కు మళ్లీ షాకిచ్చిన కోర్ట్.. రిలీజ్‌పై స్టే

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News