Janhvi Kapoor: జాన్వీ కపూర్ సినీ కెరీర్ ప్రారంభించి చాలా రోజులే అవుతోంది. అయితే ఇంత వరకు బాలీవుడ్‌లోనే ఎక్కువ చిత్రాల్ని చేసింది. కానీ అక్కడ మాత్రం ఆమెకు నటిగా గుర్తింపు రాలేదు. నటిగా ఓ కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకోలేదు. అక్కడ జాన్వీ చేసిన ప్రతీ చిత్రం ఫ్లాపుగా మారింది. దీంతో ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడింది. జాన్వీ నటించిన ఏ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మెరుగైన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది. ఇక తెలుగులో ఎంట్రీ ఇచ్చి తన ఫేట్ మార్చుకోవాలని చూసింది.
ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో జోడి కట్టేందుకు ఓకే చెప్పింది. ఎన్టీఆర్ దేవర చిత్రంతో జాన్వీ కపూర్ టాలీవుడ్ డెబ్యూ జరిగింది. దేవర మూవీలో జాన్వీ కపూర్‌కి ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేదన్న విషయం రిలీజ్ తరువాత అందరికీ అర్థమైంది. పాటలు, గ్లామర్ కోసమే ఆమెను తీసుకున్నారని అందరికీ తెలిసిపోయింది. అయితే దేవర మూవీ 500 కోట్ల క్లబ్బులో జాయిన్ అయినా కూడా జాన్వీకి మాత్రం రావాల్సిన గుర్తింపు రాలేదు. సినిమాకు కలెక్షన్లు వచ్చినా.. జాన్వీకి పేరు రాకపోవడంతో అసంతృప్తి చెందినట్టుగా తెలుస్తోంది.
Also Read- Tammareddy Bharadwaj: ఇండస్ట్రీ వంద శాతం క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. చిరుకి కౌంటర్!
అయితే ఇప్పుడు జాన్వీ కపూర్ ‘పెద్ది’ చిత్రంలో నటిస్తోంది. రామ్ చరణ్‌తో బుచ్చిబాబు తీస్తున్న ఈ సినిమాలో జాన్వీ పాత్ర ఎలా ఉంటుందో క్లారిటీ లేదు. చికిరి పాటలో అయితే జాన్వీ తన అందాలతో ఆకట్టుకుంది. ఆ పాటను చూస్తే మళ్లీ జాన్వీకి ఓ సాదాసీదా గ్లామర్ హీరోయిన్ రోల్ పడ్డట్టుగా అనిపిస్తోంది. మరి జాన్వీకి పెద్దితో అయినా మంచి పేరు, విజయం దక్కుతుందా? లేదా? అన్నది చూడాలి.
జాన్వీ మొత్తంగా ఇప్పటి వరకు 14 చిత్రాల్లో నటించింది. గుంజన్ సక్సేనా, మిల్లీ, ఉలాజ్, హోం బౌండ్ వంటి చిత్రాల్లో అంతో ఇంతో జాన్వీ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కానీ ఆడియెన్స్‌లో మాత్రం ఇంకా సరైన గుర్తింపుని మాత్రం సొంతం చేసుకోలేకపోతోన్న ఈ బ్యూటీకి పెద్దితో బ్రేక్ వస్తుందేమో చూడాలి.

