Homeచిత్ర ప్రభRanveer Singh: ‘డాన్ 3’ నుంచి రణ్ వీర్ సింగ్ అవుట్? అదే కారణమా!

Ranveer Singh: ‘డాన్ 3’ నుంచి రణ్ వీర్ సింగ్ అవుట్? అదే కారణమా!

Ranveer Singh: రణ్ వీర్ సింగ్‌తో ‘డాన్ 3’ మూవీని ఫర్హాన్ అక్తర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మామూలుగా షారుఖ్ ఖాన్ చేయాల్సిన ఈ మూవీలో చివరకు రణ్ వీర్ సింగ్ వచ్చేశాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రకటించి ఇప్పటికే చాలా నెలలు అవుతోంది. కానీ ఇంత వరకు సెట్స్ మీదకు మాత్రం సినిమా వెళ్లలేదు. ఇప్పుడు రణ్ వీర్ సింగ్ ఇమేజ్, క్రేజ్ అంతా మారిపోయింది. ‘ధురంధర్’ ఊహించని విజయం దక్కడంతో రణ్ వీర్ సింగ్ మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది. ఇక డాన్ 3 నుంచి రణ్ వీర్ సింగ్ తప్పుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తోంది.

- Advertisement -

ఎక్సెల్ సంస్థ ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ చర్యతో దాదాపు 40 కోట్ల నష్టాన్ని భరించాల్సి వస్తోందట. ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం పెట్టిన డబ్బులు, ఇన్ని నెలలు వెయిట్ చేయడం, ఇతర ఆర్టిస్టుల్ని కన్ఫామ్ చేసుకోవడం వంటి పనులతో దాదాపు 40 కోట్లు ఖర్చు పెట్టిందట. ఇక ఇప్పుడు స్క్రిప్ట్ నచ్చలేదు అని చెప్పి రణ్ వీర్ సింగ్ తప్పించుకోవాలని చూస్తున్నాడట.

Also Read- Tamannaah: నో రెమ్యూన‌రేష‌న్ – ఫ్రీగా బాలీవుడ్ సినిమాలో న‌టించిన త‌మ‌న్నా

రణ్ వీర్ సింగ్ పూర్తి స్క్రిప్ట్‌కి ఓకే చెప్పిన తరువాతే ప్రాజెక్ట్ ముందుకు కదిలిందని, ప్రీ ప్రొడక్షన్ పనుల్ని స్టార్ట్ చేశామని ఎక్సెల్ సంస్థ చెబుతోంది. ఇక ఇప్పుడు మరోసారి రణ్ వీర్ సింగ్‌కి, ఎక్సెల్ సంస్థకి మీటింగ్ జరిగిందట. కానీ మీటింగ్ సఫలం కాలేదని తెలుస్తోంది. మరి ఇలా రణ్ వీర్ సింగ్ తప్పుకుంటే మాత్రం 40 కోట్లు చెల్లించాలని ఎక్సెల్ సంస్థ అడుగుతోందట.

రణ్ వీర్ సింగ్ 40 కోట్లు చెల్లిస్తాడా? లేదా లీగల్‌గా ఎదుర్కొంటాడా? ఎక్సెల్ సంస్థ మరో హీరోని ఎప్పుడు వెతుక్కుంటుంది? అసలు డాన్ 3 ఉంటుందా? లేదా? అన్నది ఇప్పుడు బీ టౌన్‌లో చర్చగా మారింది. మార్చిలో రణ్ వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ వస్తోన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్‌తోనే హిందీ ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టాడు. ఇక ఈ రెండో పార్ట్ అయితే అన్ని భాషల్లో రిలీజ్ అవుతోంది. చూస్తుంటే ఇది పార్ట్ వన్ కంటే ఎక్కువగానే వసూళ్లు సాధించేలా ఉంది. ఇక ధురంధర్ 2 తరువాత రణ్ వీర్ సింగ్ డిమాండ్స్ ఇంకా ఎంత పెరుగుతాయో చూడాలి.

Also Read- Tollywood Strike: టాలీవుడ్‌లో మరోసారి సమ్మె సైరన్?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News