Toxic Teaser: కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. గీతూ మోహన్ దాస్ డైరెక్టర్.
ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరికి సంబంధించిన లుక్స్‌ను ఇప్పటికే మేకర్స్ విడుదల చేసి మంచి బజ్ క్రియేట్ చేశారు. తాజాగా యష్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న ‘టాక్సిక్’ నుంచి ఇంట్రడక్షన్ టీజర్‌ను విడుదల చేశారు.
ఈ సినిమాలో యష్ ‘రాయ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. రాయ పాత్రను పరిచయం చేసిన ఈ టీజర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మాఫియా డాన్స్‌లు, గన్ ఫైర్స్, బాంబుల మోతతో పాటు డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది.
Also Read – EV: భారత ఈవీ మార్కెట్లో సరికొత్త రికార్డు.. 22 లక్షలకు పైగా వాహనాల విక్రయం
యష్, గీతూ మోహన్‌దాస్ కలిసి ఈ సినిమాకు కథను రూపొందించారు. ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా పలు భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. దీంతో ఈ సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
టెక్నికల్‌గానూ సినిమా పీక్స్‌లో ఉంటుందని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. మూవీకి సినిమాటోగ్రఫీని నేషనల్ అవార్డు విజేత రాజీవ్ రవి నిర్వహిస్తుండగా, సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను ఉజ్వల్ కులకర్ణి చేపట్టగా, ప్రొడక్షన్ డిజైన్‌ను టీపీ అబీద్ పర్యవేక్షిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ (జాన్ విక్ ఫేమ్)తో పాటు నేషనల్ అవార్డు గ్రహీత అన్బరివ్ డిజైన్ చేశారు. ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ్, యష్ కలిసి నిర్మిస్తున్నారు. మొత్తంగా ‘టాక్సిక్’ యష్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read – RRB: టెన్త్ పాసైతే చాలు..సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం!

