Yash-Ramayana: బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’. నితీష్ తివారి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తెరకెక్కుతోంది ఈ సినిమా. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తోన్న ఈ మూవీలో యష్ రావణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాకి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రాతో కలిసి సంయుక్తిగా ఈ చితరం నిర్మాణంలో భాగం అయ్యాడు. ఈ నేపథ్యంలో అమెరికాలో జరుగుతున్న కామికాన్ కార్యక్రమానిక్ యస్ నిర్మాత నమిత్ మల్హోత్రాతో కలిసి హాజరయ్యాడు.
రణ్‌బీర్ అద్భుతమైన నటుడు
ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను, తన చిత్రాలకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు. ముఖ్యంగా ‘రామాయణ’ మూవీ సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తొలి భాగంలో తనకు రణ్‌బీర్‌కి మధ్య ఎలాంటి సన్నివేశాలు లేవని చెప్పాడు. రావణుడిగా తన రాజ్యం, రాముడిగా రణ్‌బీర్ రాజ్యం గురించే ఫస్ట్ పార్ట్ సాగుతుందంటూ కీలక అప్‌డేట్ ఇచ్చాడు. తమ మధ్య సన్నివేశాలు లేకపోయినా.. షూటింగ్‌లో రణ్‌బీర్ కలిశానని చెప్పాడు. తమ మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని, రణ్‌బీర్ అద్భుతమైన నటుడు అని కొనియాడాడు. తమ ఆలోచనలు కలిశాయని, కాబట్టి తామిద్దరి కెమిస్ట్రీ అనేది పెద్ద సమస్య కాదని యష్ చెప్పుకొచ్చాడు.
దీపావళికి రిలీజ్
అనంతరం ఈ ఏడాది దీపావళికి తొలి పార్ట్‌ని థియేటర్లలోకి తీసుకువస్తామని పేర్కొన్నాడు. ప్రస్తుతం యష్ కామెంట్స్ సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. కాగా యష్ కామెంట్స్ ప్రకారం.. ‘రామాయణ’ తొలి భాగంలో రాముడు, అతడి రాజ్యానికి సంబంధించిన సీన్స్.. మరోవైపు రావణుడు, అతడి రాజ్యానికి సంబంధించిన సన్నివేశాలు చూపించనున్నారని అర్థమైపోతుంది. కాబట్టి తొలి భాగంగా వీరిద్దరి రాజులుగా తమ రాజ్యం పరిపాలన చూట్టూ ఫస్ట్ పార్ట్ సాగుతుంది. అలాగే రాముడి, సీత కళ్యాణం కూడా చూపించనున్నారని తెలుస్తోంది. రెండో భాగంనే రాముడు వనవాసం, సీత అపహరణ చూపిస్తారేమో. అంటే రణ్‌బీర్, యష్‌లు మధ్య వైరం, యుద్దం సీన్స్ చూడాలంటే మరో ఏడాది వేచి చూడాల్సిందే. కాగా రామాయణాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రామాయణంపై ఎన్నో సినిమాలు వచ్చాయి.
రూ. 4వేల కోట్ల బడ్జెట్
అవి అన్ని కూడా దేనికదే అన్న టాక్ తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు నమిత్ మల్హోత్రా రామాయణ మాత్రం వాటన్నింటికి భిన్నంగా ఉంటుందంటున్నారు. తమ రామాయణంలో ఇది వరకు ఎన్నడూ చూపించని ఎన్నో సంఘటలను చూపిస్తామని, ఇతీహాసాల్లో ఉండి మనకు తెలియని ఎన్నో విషయాలను ఈ రామాయణ ద్వారా తెలియజేయబోతున్నారట. ఈ చిత్రాన్ని సుమారు రూ. 4 వేల కోట్ల బడ్జెట్‌ని కెటాయిస్తున్నట్టు మూవీ టీం వెల్లడించింది. మరి నితీశ్ తివారి డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ రామాయణ ఎలా ఉంటుందనేది ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్ అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.
#Yash confirms he and #RanbirKapoor won’t share screen space in #Ramayana Part 1.
He praised Ranbir as a brilliant actor and said their vision matches, so chemistry won’t be an issue. 🔥 pic.twitter.com/g4PSkHzBjw
— Filmyscoops (@Filmyscoopss) April 15, 2026

