Ramayana Glimpse: బాలీవుడ్, టాలీవుడ్ అనే భేదాలు లేకుండా గత కొన్నాళ్లుగా అన్ని ఇండస్ట్రీలలో మైథలాజికల్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. భారతీయ పురాణాలు, ఇతిహాస గాథలను వెండితెరపై ఆవిష్కరించేందుకు దర్శకులు ప్రయత్నాలు చేస్తోన్నారు. మైథలాజికల్ ట్రెండ్‌లో వస్తోన్న మూవీ రామాయణ. యామిమల్ తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తోన్న ఈ మూవీలో కేజీఎఫ్ హీరో యశ్ రావణుడిగా విలన్‌గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో సీతగా సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమాతోనే సాయిపల్లవి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. రామాయణ మూవీకి నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. రామాయణ ది ఇంట్రడక్షన్ పేరుతో రిలీజైన ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ గ్లింప్స్‌లో గ్రాఫిక్స్‌లో ప్రధాన పాత్రధారులను మేకర్స్ చూపించారు.
రణబీర్ కపూర్ బాణం…
చివరలో రాముడిగా నటిస్తోన్న రణబీర్ కపూర్ బాణాన్ని సంధిస్తున్న షాట్ గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలుస్తోంది. గ్లింప్స్‌లో ముసుగు ధరించి యశ్ కనిపించాడు. గ్లింప్స్ బీజీఎమ్, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.
835 కోట్ల బడ్జెట్…
రామాయణ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దాదాపు 835 కోట్ల బడ్జెట్‌తో రామాయణ మూవీ రూపొందుతోంది. రావణుడిగా నెగెటివ్ క్యారెక్టర్‌లో నటిస్తూనే ఈ సినిమా నిర్మాణంలో ఓ భాగస్వామిగా యశ్ వ్యవహరిస్తున్నాడు.
వార్ 2 వర్సెస్ రామాయణ…
కాగా రామాయణ మూవీకి శ్రీధర్ రాఘవన్ రైటర్‌గా వ్యవహరిస్తున్నాడు. డైరెక్టర్ నితీష్ తివారితో కలిసి ఈ మూవీకి శ్రీధర్ రాఘవన్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. కాగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్న స్పై యాక్షన్ బాలీవుడ్ మూవీ వార్ 2 కూడా శ్రీధర్ రాఘవన్ రైటర్‌గా వ్యవహరిస్తోండటం గమనార్హం. శ్రీధర్ రాఘవన్ రైటర్‌గా పనిచేస్తున్న ఈ రెండు సినిమాలు రెండు నెలల వ్యవధిలో రిలీజ్ కాబోతున్నాయి. రెండూ కంప్లీట్ డిఫరెంట్ జానర్ మూవీస్ కావడం బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
రహమాన్ మ్యూజిక్…
రామాయణ మూవీలో హనుమంతుడిగా సన్నీడియోల్, లక్ష్మణుడిగా రవీ దూబే నటిస్తున్నారు. ఈ సినిమాకు హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. హిందీతో పాటు తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. మరోవైపు వార్ 2 మూవీ ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.