Yellamma: బలగం వేణు ఎల్లమ్మ సినిమా కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి మరో అడ్డంకి వచ్చింది. ఈ సినిమా సెట్స్‌పైకి రావడానికి మరో రెండు నెలల కంటే ఎక్కువే టైమ్ పట్టేలా కనిపిస్తోంది. ఇటీవలే దేవిశ్రీప్రసాద్ హీరోగా ఈ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. ఫిబ్రవరిలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని అనుకున్నారు. దేవిశ్రీప్రసాద్ కూడా డేట్స్ ఇచ్చారు.
కానీ సడెన్‌గా ఉస్తాద్‌భగత్‌సింగ్ రిలీజ్ డేట్ ప్రీ పోన్ కావడంతో ఎల్లమ్మపై ఎఫెక్ట్ పడింది. ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన రీ రికార్డింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయట. మరోవైపు చివరి నిమిషంలో ఓ పాటను కూడా యాడ్ చేయాలని మేకర్స్ ఫిక్సైనట్లు సమాచారం. ఈ రికార్డింగ్, సాంగ్ కంపోజింగ్ పనులతో దేవిశ్రీ బిజీ అయినట్లు తెలిసింది.
Also Read – Team India: చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు..
దాంతో ఫిబ్రవరిలో మొదలుపెట్టాలని అనుకున్న ఎల్లమ్మ షూటింగ్‌కు మరోసారి బ్రేక్ పడింది. ఉస్తాద్ భగత్‌సింగ్ మ్యూజిక్‌కు సంబంధించిన పనులన్నీ పూర్తయిన తర్వాతే ఎల్లమ్మ షూటింగ్‌ను మొదలుపెట్టాలని దేవిశ్రీ భావిస్తున్నారట. ఏప్రిల్ నుంచి ఎల్లమ్మ సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దసరాకు ఎల్లమ్మను రిలీజ్ చేయాలని నిర్మాత దిల్‌రాజు భావిస్తున్నారట. ఆరు నెలల లోపు షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని బలగం వేణుకు డెడ్‌లైన్ పెట్టినట్లు సమాచారం.
హీరోగా దేవిశ్రీప్రసాద్‌కు ఇదే డెబ్యూ మూవీ. మ్యూజిక్ అవుట్‌పుట్ పరంగానే దేవిశ్రీప్రసాద్ అస్సలు కాంప్రమైజ్ కారు. యాక్టింగ్ అనేసరికి డబుల్ ఎఫర్ట్స్ పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఆలస్యమైన ఆడియెన్స్‌కు మంచి సినిమాను అందివ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. దిల్‌రాజు పెట్టిన డెడ్‌లైన్ లో దేవిశ్రీప్రసాద్‌ను మెప్పించేలా సినిమా చేయడం వేణుకు ఛాలెంజింగ్ అని టాలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి.
ప్రస్తుతం హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల ఎంపికచేసే పనిలో డైరెక్టర్ బలగం వేణు ఉన్నారట. తొలుత ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ పేరు వినిపించింది. నాని హీరో కావడంతో ఎల్లమ్మలో నటించడానికి కీర్తి సురేష్ అంగీకరించింది. నాని తప్పుకోవడంతో కీర్తి కూడా ఎల్లమ్మ నుంచి వైదొలిగింది. దేవిశ్రీప్రసాద్‌కు జోడీగా ఎల్లమ్మలో ఎవరు నటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఎల్లమ్మ మూవీకి దేవిశ్రీప్రసాద్ స్వయంగా మ్యూజిక్ అందిస్తున్నారు.
Also Read – Ustaad Bhagat Singh: అప్పుడు చిరు – ఇప్పుడు పవన్ – ఉస్తాద్ భగత్‌సింగ్‌లో ఇళయరాజా పాట

