Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో పది మంది మావోయిస్టులు హతమయ్యారు. గరియాబంద్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, వరంగల్ జిల్లా ఘన్‌పూర్‌కు చెందిన మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ సహా 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. మనోజ్‌పై గతంలో రూ.2 కోట్ల రివార్డు ఉంది. మృతుల్లో ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రమోద్ యారఫ్ పాండు కూడా ఉన్నారు. మరికొందరు కీలకనేతలు చనిపోయినట్టు భావిస్తున్నారు. ఎదురు కాల్పులు ముగిసిన తర్వాతే మృతులపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది. గరియాబంద్ ఈ30, ఎస్‌టీఎఫ్, కోబ్రా జవాన్లు ఆపరేషన్‌లో పాల్గొన్నారు. గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా ఎన్‌కౌంటర్‌ని పర్యవేక్షిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
Read Also: Rithu Chowdary: వస్తువుల్ని కాదు.. మనసుల్ని దొంగతనం చేస్తాం- రీతూ చౌదరి


