Minor girl harassment: జంతువుల వలే కామాంధులు చెలరేగిపోతున్నారు. తాజాగా ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఒక హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. 11 ఏళ్ల బాలిక మృతదేహం కాలువలో లభ్యమయ్యింది. బాలిక శరీరంపై తీవ్ర గాయాలను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి .. దర్యాప్తు ప్రారంభించారు. బాలికను అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉండవచ్చనని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక మరణంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిందుతులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డును దిగ్బంధించారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం: 5వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలిక ఆదివారం సాయంత్రం నుంచి కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం రాత్రంతా వెతికారు. అయినా ఆమె కనిపించకపోవడంతో.. వారు అంగుల్ సదర్ పోలీస్ స్టేషన్‌లో బాలిక మిస్ అయినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాలిక మృతదేహాన్ని ఒక మురుగు కాలువలో గుర్తించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అంగుల్ ఎస్పీ రాహుల్ జైన్ వెంటనే.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ బృందం, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకొని.. ఆధారాలు సేకరిస్తున్నారు. నిందుతులను వెంటనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ రాహుల్ తెలిపారు.
Also Read: https://teluguprabha.net/crime-news/minor-girl-harassed-by-old-man-in-chittoor-district/
ఇటీవల ఏపీలో సైతం ఇలాంటి ఘటనే: అన్న వరుస అయిన వ్యక్తి మైనర్ బాలికను అత్యాచారం చేసిన ఘటన చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలంలో చోటుచేసుకుంది. వరుసకు చెల్లెలు అయిన మైనర్ బాలికపై కన్నేసిన కామాంధుడు కటకటాల పాలయ్యాడు.
ఊరి చివర మామిడితోటకు తీసుకెళ్లి: బ్రాహ్మణపల్లికి చెందిన 11 ఏళ్ల మైనర్ బాలిక స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. బ్రాహ్మణపల్లి నుంచి పాఠశాల వద్ద వదిలి పెడతానని బాలికను బైక్‌పై తీసుకెళ్లిన ప్రసాద్ అనే వ్యక్తి మృగంలా మారాడు. 40 ఏళ్ల కామాంధుడు.. బాలికకు అన్న వరుస అవుతానన్న విషయాన్ని మరిచాడు. మైనర్ బాలికను తల్లిదండ్రులు నమ్మకంతో ప్రసాద్‌తో పంపించగా.. విచక్షణ మరిచిన ప్రసాద్… ఊరి చివర మామిడితోట వద్దకు తీసుకెళ్లి వక్రబుద్ధిని ప్రదర్శించాడు. 11 ఏళ్ల మైనర్ బాలికను అత్యాచారం చేశాడు.
ఎవరికైనా చెబితే చంపేస్తా: బాలికపై అత్యాచారానికి పాల్పడి ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ప్రసాద్ బెదిరించారు. తిరిగి పాఠశాల వద్ద వదిలిపెట్టాడు. అయితే మైనర్ బాలిక తనపై జరిగిన లైంగిక దాడి ఘటనను ఏడుస్తూ ఉపాధ్యాయులకు చెప్పింది. వెంటనే బాలిక తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని అందించారు. అనంతరం ఉపాధ్యాయులు వెదురు కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసారు. బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మెుదలు పెట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.


