Homeనేరాలు-ఘోరాలుMiyapur: మియాపూర్‌లో విషాదం.. నీటి సంపులో పడి 13ఏళ్ల బాలిక మృతి

Miyapur: మియాపూర్‌లో విషాదం.. నీటి సంపులో పడి 13ఏళ్ల బాలిక మృతి

Water Sump: మియాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో 13ఏళ్ల బాలిక నీటి సంపులో పడి మరణించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా.. లేదా మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

వారం క్రితమే వాచ్‌మెన్‌గా చేరిన చరణ్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి కుమార్తె నీటి సంపులో పడి మృతి చెందింది. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాది కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మద్దిరాల తండాకు చెందిన చరణ్, రేణుక దంపతులు బతుకుతెరువు కోసం పదేళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చారు. మియాపూర్ గోకుల్ ఫ్లాట్స్‌ పరిసరాల్లో వాచ్‌మెన్‌లుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు ఉన్నారు. అయితే చరణ్ 8 రోజుల క్రితం స్థానిక శ్రీరెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా చేరారు.

Also read-Suicide: కడపలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట!

అనుమానాలు వ్యక్తం చేస్తున్న బాలిక తల్లిదండ్రులు: సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో చరణ్ కుమార్తె సారా (13) అపార్ట్‌మెంట్ ఆవరణలో మూత తీసి ఉన్న నీటి సంపులో పడిపోయింది. అయితే కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన చెందిన చరణ్ దంపతులు సమీపంలో గాలించారు. ఎంతకీ కనపడక పోవడంతో.. చివరకు అనుమానం వచ్చి నీటి సంపులో చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. అచేతన స్థితిలో ఉన్న సారాను వెంటనే నిజాంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలిక మృతిపై ఆమె తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా.. లేదా మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News