Girl Assaulted In Kolkata Government Hospital Toilet: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న SSKM ఆసుపత్రి టాయిలెట్‌లో ఒక 14 ఏళ్ల బాలికపై ఆ ఆసుపత్రిలోని మాజీ ఉద్యోగి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
నిందితుడు అమిత్ మల్లిక్ అనే మాజీ వార్డు బాయ్‌ను బుధవారం రాత్రి ధాపా ప్రాంతంలో అరెస్ట్ చేశారు. అతనిపై POCSO చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన గురించి మౌఖిక సమాచారం అందిన వెంటనే భవానీపూర్ పోలీసులు బాధితురాలిని సంప్రదించి, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. 14 ఏళ్ల బాధితురాలి సంతకంతో కూడిన వాంగ్మూలం ఆధారంగా భవానీపూర్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ALSO READ: Caste-Based Violence: దళితుడిపై దాడి చేసి, మూత్రం తాగించిన దుండగులు.. డ్రైవర్ ఉద్యోగం మానేసినందుకు
తల్లిదండ్రులు టికెట్ కౌంటర్ వద్ద ఉండగా..
బాధితురాలి కుటుంబ సభ్యులు దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, బాలిక తల్లిదండ్రులు ఔట్ పేషెంట్ విభాగం (OPD) టికెట్ కౌంటర్ వద్ద బిజీగా ఉండగా, నిందితుడు ఆమెను పక్కనే ఉన్న టాయిలెట్‌కు రమ్మని చెప్పి తీసుకువెళ్లి దాడికి పాల్పడ్డాడు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరగడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు కొద్ది రోజుల ముందు, హౌరా జిల్లాలోని ఉలుబేరియాలోని ఒక ఆసుపత్రిలో ఒక మహిళా డాక్టర్‌పై రోగి కుటుంబ సభ్యులు లైంగిక హింసకు పాల్పడతామని బెదిరించారు. ఆ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. గత ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఒక పీజీ ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా భారీ నిరసనలకు దారితీసింది.
ALSO READ: Samosa Argument Murder: సమోసా విషయంలో పిల్లల మధ్య గొడవ.. జోక్యం చేసుకున్న వృద్ధుడిని హతమార్చిన మహిళ


