Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుCocaine Seized : ఢిల్లీ ఎయిర్ పోర్టులో కోట్ల విలువైన కొకైన్ లభ్యం..

Cocaine Seized : ఢిల్లీ ఎయిర్ పోర్టులో కోట్ల విలువైన కొకైన్ లభ్యం..

ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా కొకైన్ ను సీజ్ చేశారు. పశ్చిమ ఆఫ్రికా నుండి వస్తున్న ఓ ప్రయాణికురాలి వద్ద కొకైన్ క్యాప్సుల్స్ ను గుర్తించారు. అయితే.. ఆ క్యాప్సుల్స్ దొరికింది ఆమె లగేజీలో కాదు. ఆమె పొట్టలో. సినీ ఫక్కీలో ఆ కిలాడీ లేడీ కొకైన్ క్యాప్సుల్స్ ను మింగేసింది. ఎయిర్ పోర్టులో దిగాక.. గ్రీన్ ఛానల్ ను దాటే ప్రయత్నం చేయగా.. ఎర్రర్ వచ్చింది. దాంతో ఆమెతో ఉన్న లగేజీని చెక్ చేశారు. ఎక్కడా ఏదీ దొరకలేదు.

- Advertisement -

ఆ తర్వాత అధికారులు తమదైన స్టైల్లో ఆమెను విచారణ చేయగా.. అసలు విషయం తెలిపింది. తన బాడీలో కొకైన్ తో కూడిన క్యాప్సుల్స్ ను గుర్తించారు. ఆమె ఆస్పత్రికి తరలించి.. శస్త్రచికిత్స ద్వారా 82 కాప్సుల్స్ ను బయటికి తీశారు. కస్టమ్స్ అధికారులు 15.36 కోట్ల విలువ చేసే 1024 గ్రాముల కొకైన్ ను సీజ్ చేశారు. నిందితురాలి పై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad