Monday, March 10, 2025
Homeనేరాలు-ఘోరాలుఇదేందయ్యా ఇది.. ముగ్గురు పిల్లల తల్లితో లేచిపోయిన ఇంటర్ విద్యార్థి.. ఎక్కడంటే..!

ఇదేందయ్యా ఇది.. ముగ్గురు పిల్లల తల్లితో లేచిపోయిన ఇంటర్ విద్యార్థి.. ఎక్కడంటే..!

ప్రస్తుతం సమాజంలో కొన్ని ఘటనలు ఎంతో షాకింగ్ కి గురి చేస్తుంటాయి. అలాంటి ఓ ఘటనే మహారాష్ట్ర లోని నాగ్‌పూర్‌లో జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి.. ఓ మహిళను తీసుకొని లేచిపోయాడు. అయితే అసలు విషయం ఏమిటంటే ఆ మహిళ వయసు 36 సంవత్సరాలు కాగా.. విద్యార్థి వయసు 16 సంవత్సరాలు. అంతేకాదు సదరు మహిళకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో క్రైమ్ బ్రాంచ్‌లోనిక్రైమ్ బ్రాంచ్‌లోని యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అతన్ని రక్షించింది. ఈ ఘటనపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. సదరు మహిళ విద్యార్థి ఇంటి సమీపంలో ఉండేదని.. ఆసమయంలోనే వారిద్దరూ ఒకే ఆలయానికి వచ్చేవారని పోలీసులు తెలిపారు.

- Advertisement -

ఆ సమయంలో యువకుడి తండ్రి, తన కూతురి అనారోగ్యం గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారంట. అనంతరం ఆమెతో యువకుడు స్నేహం చేశాడు… తర్వాత ఇద్దరూ దగ్గరయ్యారు. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని గమనించిన తండ్రి పలుమార్లు అతడిని మందలించాడు. అతడిని మహిళ నుంచి దూరం చేయడానికి ఓల్డ్ మంగళ్వాడిలోని తన బంధువుల ఇంటికి పంపారు. అయితే టీనేజ్ విద్యార్థి ఆ మహిళతో వెళ్లిపోవాలని నిర్ణయించుకుని ఇద్దరూ వెళ్లిపోయారు.

దీంతో విద్యార్థి తల్లిదండ్రులు లాకాడ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, కిడ్నాప్ కేసు పెట్టారు. మరోవైపు మహిళ కుటుంబం కూడా స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు తర్వాత పోలీసులు అతడు ఎక్కడున్నాడో కనిపెట్టి.. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ మహిళను లకాడ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించామని, అక్కడ కిడ్నాప్ కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. అరెస్టు తర్వాత, మహిళను కోర్టు ముందు హాజరుపరచగా.. ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.

వీరిద్దరు డిసెంబర్ 2న పారిపోయారు. నాలుగు నెలల తర్వాత వీరిని మధ్యప్రదేశ్ బాలాఘాట్‌లో వీరిని గుర్తించారు. సదరు మహిళ తన బంగారు గొలుసును అమ్మి ఇంటిని అద్దెకు తీసుకుని, ఇంటికి కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసింది. మహిళ క్యాటరింగ్ గ్రూప్‌లో వంట మనిషిగా పనిచేస్తుండగా, టీనేజర్ సర్వీస్ బాయ్‌గా చేరాడు. అయితే, నాగ్‌పూర్ పోలీసులు వీరు ఎక్కడ ఉంటున్నారో గుర్తించి వారిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. టీనేజన్ తన సోదరికి సోషల్ మీడియా ద్వారా మెసేజ్ చేయడంతో, వీరు ఎక్కడ ఉంటున్నారనే వివరాలను పోలీసులు గుర్తించగలిగారు. కుటుంబాలు వీరి వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకిస్తున్నాయి. గతంలో కూడా వీరిద్దరు ఇంటి నుంచి పారిపోయి నాలుగు రోజుల తర్వాత తిరిగి వచ్చారు. ఆ మహిళ పెద్ద కొడుకు వయసు 12 ఏళ్లు. పారిపోయిన టీనేజర్ వయసు కన్నా 4 ఏళ్లు చిన్నవాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News