Homeనేరాలు-ఘోరాలుTragedy: గో సంరక్షణ శాలలో విషాదం.. యూరియా తిని 18 ఆవులు మృతి 

Tragedy: గో సంరక్షణ శాలలో విషాదం.. యూరియా తిని 18 ఆవులు మృతి 

నరసరావుపేట (తెలుగు ప్రభ): యూరియా తిని 18 ఆవులు మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా గొల్లపాడు ముప్పాళ్ళ మండలం మాదాల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. టీడీపీ నేత కోటేశ్వరరావుకి చెందిన ఆవులు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

- Advertisement -

కోటేశ్వరరావుకి చెందిన అమరావతి గో సంరక్షణ శాలలో నిల్వ ఉంచిన యూరియా తిని ఆవులు మృతి చెందాయి. సోమవారం నిన్న వాన ధాటికి కరిగి పశువుల మేతలో కలిసిపోయాయి. ఈ విషయాన్ని గమనించక యూరియా ఉన్న చోటే మేత వేయడంతో వాటిని తిన్న ఆవులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనపై జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News