20-Year-Old Woman Gang-Raped In Maharashtra: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. తెలంగాణకు చెందిన 20 ఏళ్ల యువతిపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
శుక్రవారం రాత్రి పర్లీ రైల్వే స్టేషన్‌లో ఆ యువతి ఒంటరిగా ఉండగా, నిందితుల్లో ఒకడు ఆమెను మభ్యపెట్టి బైక్‌పై తీసుకెళ్లాడు. నిర్మానుష్యంగా ఉన్న ఓ టిన్ షెడ్‌లోకి తీసుకెళ్లిన తర్వాత, అక్కడ ఉన్న మరో ముగ్గురు అతనితో కలిశారు. ఆ తర్వాత, శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజాము మధ్య ఆ ముగ్గురు యువతిపై అత్యాచారం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అంబాజోగై రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని వివిధ సెక్షన్ల కింద గ్యాంగ్ రేప్, క్రిమినల్ బెదిరింపులు, గాయాలు కలిగించడం వంటి అభియోగాలతో నలుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


