పల్నాడు జిల్లా నూజెండ్ల మండలంలో దారుణం చోటుచేసుకుంది. రవ్వవరం గ్రామంలో నాలుగు నెలలు బాలుడిని పంది కొక్కులు(bandicoot) కొరికి చంపేశాయి. ఈ విషాద ఘటనతో కుటుంబీకులు రోధనలు మిన్నంటాయి.
నాయిని కొండ గురువయ్య, దుర్గమ్మలకు రెండవ సంతానం ఈ చిన్న బాబు. ఈ పిల్లాడిని ఇంట్లో ఊయలలో ఉంచి తల్లి బయటకు వెళ్లింది. దీంతో ఊయలలో ఉన్న బాబుపై పందికొక్కులు దాడి చేశాయి. ముఖాన్ని పీక్కు తిన్నాయి.
ఊయలలో రక్తం స్రావంతో పడిన బాబుని చూసిన తల్లి రోధనలు చూసి చుట్టూ పక్కల వారు, బంధువుల సాయంతో ఆసుపత్రికి తరలించేలోపే బాబు మృతి చెందారు. తన ముద్దుల కుమారుడు చనిపోయాడన్న తల్లి రోదించే తీరు అందరిని కంటతడి పెట్టించాయి.
గ్రామాల్లో తిరిగి గాజులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నా తల్లికి తన కొడుకు లేడనే చేదు విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది.