Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుAmerica : కొలరాడో గే నైట్ క్లబ్ లో కాల్పుల కలకలం..

America : కొలరాడో గే నైట్ క్లబ్ లో కాల్పుల కలకలం..

అమెరికాలోని కొలరాడో గే నైట్ క్లబ్ లో ఓ దుండగులు కాల్పులు జరిపిన కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో 18 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. కొలరాడోలోని ‘క్లబ్ క్యూ’ అనే నైట్ క్లబ్ లో ఓ దుండగుడు తన వద్దనున్న తుపాకీతో కాల్పులు జరిపాడు.

- Advertisement -

ఈ కాల్పుల ఘటనలో ఐదుగురు మరణించగా.. 18 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. క్లబ్ వద్దకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డవారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాగా.. నవంబర్ 20న అక్కడ ‘ట్రాన్స్‪జెండర్ డే ఆఫ్ రిమెంబ్రెన్స్ (టీడీఓఆర్)’ జరుపుకుంటారు. ట్రాన్స్‌జెండర్లు, గేలు, లెస్బియన్లు ఈ డే ను స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ సెలబ్రేషన్స్ కోసం ‘క్లబ్ క్యూ’ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిందితుడు ఎందుకు కాల్పులకు పాల్పడ్డాడన్న విషయం తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News