హైదరాబాద్ లో దారుణం జరిగింది. జవహర్‌నగర్ (Jawaharnagar) లో ఐదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. దీనిపై కుటుంబసభ్యులు జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనకి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జవహర్‌నగర్ (Jawaharnagar) కి చెందిన పరమేష్ కుమార్ (30) అనే నిందితుడు భవన నిర్మాణ కార్మికుడుగా జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రోజు అదే ఏరియాకి చెందిన చిన్నారిని ఎవరూ చూడని సమయంలో చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని, చెప్తే నిన్నూ, మీ ఇంట్లోవాళ్ళని చంపేస్తానని బాలికను బెదిరించాడు. సోమవారం బాలికకి రక్తస్రావం అవడం గమనించిన తల్లి ఆరా తీయగా జరిగిన ఘోరాన్ని బాలిక వివరించింది. దీంతో వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు జవహర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.