Thursday, April 3, 2025
Homeనేరాలు-ఘోరాలుMadhyapradesh Road Accident : ప్రయాణికులపైకి దూసుకెళ్లిన లారీ.. ఆరుగురి దుర్మరణం

Madhyapradesh Road Accident : ప్రయాణికులపైకి దూసుకెళ్లిన లారీ.. ఆరుగురి దుర్మరణం

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బస్సుకోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి లారీ దూసుకెళ్లడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం సాయంత్రం రత్లాం జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సత్రుండ సమీపంలోని రత్లాం-ఇండోర్ ఫోర్ లైన్ రోడ్డుపై కొందరు ప్రయాణికులు బస్సుకోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో అటువైపుగా లోడుతో వేగంగా వెళ్తున్న లారీ టైర్ పగలడంతో.. అదుపుతప్పి ప్రయాణికులమీదికి దూసుకెళ్లింది. దాంతో డ్రైవర్ లారీని అక్కడే వదిలేసి పరారయ్యాడు.

- Advertisement -

ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో 12 మంది తీవ్రగాయాల పాలయ్యారు. ఘటనా ప్రాంతమంతా రక్తపు మరకలతో, చెల్లాచెదరుగా పడిన ఉన్న మృతదేహాలతో భీతావహంగా మారింది. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పోలీసులు గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరగవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News