Friday, March 13, 2026
Homeనేరాలు-ఘోరాలుCrime: బాలికపై యువకుడు అత్యాచారం.. మనస్తాపంతో బాధితురాలు ఆత్మహత్య

Crime: బాలికపై యువకుడు అత్యాచారం.. మనస్తాపంతో బాధితురాలు ఆత్మహత్య

Rape On Minor UP: మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కీచకుడు. ఆ ఘాతుకం భరించలేని బాధితురాలు మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించింది. ఆస్పత్రిలో చావుతో పోరాడి ఓడి శుక్రవారం మృతి చెందింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/ncp-merger-jayant-patil-revelations-sharad-ajit-pawar-maharashtra-politics/

అత్యాచార కేసులకు సంబంధించి ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు అమలు చేస్తున్నా దేశవ్యాప్తంగా నిత్యం ఈ ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఆడవారిపై అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో మీరట్‌ జిల్లాలోని బహ్సుమా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 16 ఏళ్ల బాలికపై ఓ యువకుడు(25) అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మరణించింది. 

Also Read: https://teluguprabha.net/national-news/ayodhya-ram-temple-construction-completion-cost-details-2026/

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు అనుజ్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుడితో పాటు తల్లి, తండ్రి, సోదరుడిపై కూడా పోక్సో, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, బాధితురాలి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బహ్సుమా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ పోలీసు బలగాలను మోహరించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News