రోడ్డు ప్రమాదాలకు(Road accident) అడ్డుకట్ట పడటం లేదు. నిత్యం ఎంతో మంది రోడ్డు ప్రమాదాల బారిన పడే మృత్యువాత పడుతున్నారు. అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ప్రమాదాలను అరికట్టలేకపోతున్నారు. ఇందులో భాగంగానే యూపీలో (UP Road Accident) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ట్రక్కును ఢీకొట్టిన బస్సు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన యూపీలో శనివారం తెల్లవారుజామున సంభవించింది. ఆగ్రా-లక్నో హైవేపై ఆగి ఉన్న ట్రక్కును బస్సు వెనుక వైపు నుంచి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా 19 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
నదిలో స్నానానికి దిగి ఇద్దరు యువకుల మృతి
మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నలుగురు యువకులు సరదాగా ఈత కొడదామని ఏడుపాయల వద్ద నదిలోకి దిగారు. అయితే అలల ధాటికి నలుగురు యువకుల్లో ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరు యువలకు మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.