Homeనేరాలు-ఘోరాలుKamareddy: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఐదేళ్ల బాలుడి దారుణ హత్య!

Kamareddy: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఐదేళ్ల బాలుడి దారుణ హత్య!

Kamareddy Crime: కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్నకొడుకును కడతేర్చిన హృదయవిదారక ఘటన శ్రీరాంనగర్‌ కాలనీలో శుక్రవారం రాత్రి జరిగింది. వివాహేతర సంబంధాల వ్యామోహంలో పడి కన్నపేగునే తెంచుకున్న ఈ ఘటన సభ్యసమాజాన్ని విస్మయానికి గురిచేసింది.

- Advertisement -

అసలేం జరిగిందంటే: రాజంపేట మండలానికి చెందిన ఓ మహిళ గత కొంతకాలంగా తన భర్తకు దూరంగా ఉంటుంది. ఎనిమిదేళ్ల కూతురు, ఐదేళ్ల కుమారుడు శ్రావణ్‌తో కలిసి శ్రీరాంనగర్‌ కాలనీలో నివాసముంటోంది. ఈ క్రమంలో బీబీపేట మండలానికి చెందిన నర్సింలు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధంగా మారింది. దీంతో వారిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. అయితే వారిద్దరి సాన్నిహిత్యానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని ఆ మహిళ భావించింది.

పథకం ప్రకారం హత్య: కూతురిని పుట్టింటి వద్ద వదిలిపెట్టినప్పటికీ.. బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న కుమారుడు శ్రావణ్‌ తమ ఏకాంతానికి అడ్డువస్తున్నాడని ఆ జంట భావించింది. బాబును వదిలించుకోవాలని తల్లి, ఆమె ప్రియుడు కలిసి పక్కా పథకం వేశారు. శుక్రవారం రాత్రి మహిళ ఇంట్లో లేని సమయం చూసి.. నర్సింలు మద్యం మత్తులో అక్కడికి చేరుకున్నాడు. ముందుగా చిన్నారి కళ్లలో కారం చల్లి.. ఆపై కర్రతో తలపై బలంగా కొట్టి అతి కిరాతకంగా చంపేశాడు.

Also read-Dubbaka: మైనర్ బాలిక ఆత్మహత్య.. భర్తపై ఫిర్యాదు చేసిన భార్య!

రంగంలోకి పోలీసులు: సమాచారం అందుకున్న పట్టణ సీఐ నరహరి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నర్సింలుతో పాటు, హత్యకు సహకరించిన బాలుడి తల్లిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News