Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుNandyala: 48 గంటల్లో 12 ఫైల్స్ పై సంతకాలు-ఆ లేడీ ఆఫీసర్..

Nandyala: 48 గంటల్లో 12 ఫైల్స్ పై సంతకాలు-ఆ లేడీ ఆఫీసర్..

50 కోట్ల భూ లావాదేవీలు

నంద్యాల డివిజన్ పరిధిలో ఆమె ఒక మండల ద్వితీయ స్థాయి రెవెన్యూ అధికారిణి. కానీ ఆమె పనిచేసే ఏ రెవెన్యూ కార్యాలయంలోనైనా సరే ద్వితీయ స్థాయి అధికారినిణిగా కాకుండా ప్రథమ స్థాయి అధికారిణిగా చలామణి అవుతుంది. ఆమె చేసే హడావిడి అంతా ఇంత కాదని ఆమె పని చేసే కార్యాలయాల సిబ్బంది సైతం బయట చెబుతుండటం విశేషం. మరీ ముఖ్యంగా ఇరు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులంతా తమ బంధువులు అంటూ తోటి అధికారులకు, ఆమెపై ఉన్నత అధికారులకు ఏదో ఒక సమయంలో చెబుతూ ఉంటుందని ఆమె సన్నిహితులు ద్వారా తెలిసింది. గత కొన్ని రోజుల క్రితం రాబోయే ఎన్నికల దృష్ట్యా తహసిల్దార్ ల బదిలీలు జరిగాయి. గతంలోనూ ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆమెకు ఇది మరో అవినీతి అవకాశంగా లభించింది. ఆమె కార్యాలయంలో పనిచేసే తహసిల్దార్ రిలీవ్ కావడం, మరో పక్క నూతన తహసిల్దార్ బాధ్యతలు చేపట్టడానికి రెండు రోజులు సమయం పట్టడంతో ఎఫ్ఏసీగా ఉన్న ఆమె 48 గంటల్లో 12 దస్త్రాలు లపై సంతకాలు చేసి 50 కోట్ల భూమికి ఆర్ ఐ వంటి క్రింది స్థాయి అధికారుల సంతకాలు లేకుండానే ఆమె చేయడంతో పత్రికల పూటల్లోకి ఎక్కింది.

- Advertisement -

ఎకరా రూ.4 కోట్లు..

ఆ అదికారిణి పనిచేసే రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ లు 597-1లో 0.14 ఎకరాలు, 598-1లో 0.71 ఎకరాలు, 600-1బి లో 1.30 ఎకరాలు, 5.79 లో 2.71 ఎకరాలు, 580లో 2 ఎకరాలు, 600-1లో 4.40 ఎకరాల భూముల విలువ ఎకరా నాలుగు కోట్ల చొప్పున 12 దస్త్రాల విలువ దాదాపు రూ.50 కోట్లు పలుకుతుంది. ల్యాండ్ కన్వర్షన్ కోసం సుమారు రూ.50 కోట్లు విలువచేసే భూములకు సంబంధించిన 12 దస్త్రాలపై సంతకాలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విఆర్ఓ స్థానం నుంచి ఆర్డిఓ స్థాయి అధికారి వరకు అందరూ భాగస్వాములు కావలసి ఉండగా కేవలం ఈ రెవిన్యూ ద్వితీయ స్థాయి అధికారిణి, ఆర్డీవో కార్యాలయంలోని ఓ సీనియర్ అసిస్టెంట్ ఇద్దరూ ఈ కథ నడిపించినట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే కొందరు సిబ్బంది గుసగుసలాడుతుండటం ఆశ్చర్యం పరుస్తుంది. ఈ దస్త్రాలపై సంతకాలు చేసినందుకు భారీ స్థాయిలో ముడుపులు పొందాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉన్నత అధికారుల అభిరుచులను, అలవాట్లను ముందే గుర్తించడం అ అధికారిణి నైజం

రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే అధికారైన మూడు లేదా నాలుగు సంవత్సరాలు పని చేస్తారు. కానీ అ ఆదికారిణి ఒకే కార్యాలయంలో విధులు నిర్వహించబట్టి దాదాపు 4 నుంచి 5 సంవత్సరాలు అవుతుంది. ఆమె పని చేసే కార్యాలయంలో ఇప్పటికే 4 తహసిల్దార్లు మారినప్పటికీ ఆమె మాత్రం స్థిరంగా ఉండడం చూస్తే ఆమెకు ఏ స్థాయిలో పలుకుబడి ఉందో అర్థం చేసుకోవచ్చును. ఎవరైనా కొత్తగా ఆమెపై ఉన్నతాధికారులు వస్తే, ఆ అధికారుల వద్ద పనిచేసే సిబ్బంది ద్వారా వారి ఆహార నియమాలను, అభిరుచులను, తప్పు ఒప్పులను పసిగట్టి సిబ్బంది ద్వారా వారికి ఏమి కావాలో సిబ్బంది ద్వారా సమకూరుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ మధ్యలో బదిలీపై వెళ్లిన ఓ ఉన్నతాధికారి సతీమణికి ఓ మంచి బహుమానం కూడా అందించినట్టు సిబ్బంది ద్వారా తెలిసింది.

గతంలోనూ ఆ అధికారిణిపై అనేక ఆరోపణలు

ఆ అధికారిణి నూతనంగా కొనుగోలు చేసిన గృహానికి ఇంటి పనుల నిమిత్తం ఇద్దరి తలారిలను నియమించినట్టు ఆరోపణలు వచ్చాయి. కోర్టులో ఉన్న ఓ పొలం విషయంలో ఓ డాక్టర్ కు అనుకూలంగా సంతకాలు చేపించినందుకు భారీ స్థాయిలో ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ సిఐతో చేతులు కలిపి కోట్లు విలువ చేసే స్థలాన్ని పేదల నుంచి లాక్కొని కొందరి పెద్దలకు వచ్చేటట్లు చేయడంలో ఈమె కీలకంగా వహించి ముడుపులు బాగానే పొందారనే ఆరోపణలు ఉన్నాయి.

విచారణకు ఆదేశించిన కలెక్టర్

ఆ రెవెన్యూ మండల ద్వితీయ స్థాయి అధికారిణిపై వచ్చిన కొన్ని ఆరోపణలపై జిల్లా నూతన కలెక్టర్ శ్రీనివాసులు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్టు సమాచారం. అయితే ఆ అధికారిణి అవినీతి దస్త్రాలపై విచారణ చేస్తున్న అధికారులపై కొందరు ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఏది ఏమైనాప్పటికీ ఆమెపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారించి, తప్పు జరిగినట్టు తెలిస్తే చర్యలు తీసుకుంటారో లేదో కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News