మహా శివరాత్రి రోజున విషాదం జరిగింది. డబ్బు ఇవ్వలేదని తల్లిదండ్రులపై కుమారుడు కత్తితో దాడి(Attack) చేసి గాయపరిచాడు. ఈ ఘటనలో బాధితులు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బలిజపల్లి పూసల వీధిలో ఈ దారుణం చోటుచేసుకుంది.
బుధవారం తెల్లవారుజామున శ్రీరాములు, నాగమ్మ దంపతులను తన కొడుకు ప్రేమ్ సాయి కత్తితో దాడి చేశాడు. డబ్బు ఇవ్వలేదని కారణంతో కిరాతంగా పొడిచినట్లు బాధితులు తెలిపారు. తీవ్ర రక్తస్రావం అయిన వారిని వెంటనే స్థానికులు రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతరం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Attack: తల్లిదండ్రులపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసిన కొడుకు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES