Sunday, March 23, 2025
Homeనేరాలు-ఘోరాలుBreaking News: తల్లిని వలలో వేసుకుని.. మైనర్ బాలికకు కడుపు చేసిన దుర్మార్గుడు

Breaking News: తల్లిని వలలో వేసుకుని.. మైనర్ బాలికకు కడుపు చేసిన దుర్మార్గుడు

ఇంత నీచంగా మనుషులంటారా..? అని ఈ ఘటన చూస్తేనే అర్థం అవుతుంది. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు బాబాయ్. ఆ పిలుపుకే మచ్చ తెచ్చేలా ప్రవర్తించాడు ఈ మృగాడు. ఏకంగా తల్లితో ఎఫైర్ పెట్టుకుని కూతురికి కడుపు చేశాడు. తల్లిని వలలో వేసుకుని మైనర్ బాలికకు(Minor girl) కడుపు చేశాడు దుర్మార్గుడు.

- Advertisement -

వరుసకు మరిదయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించి.. సొంత కూతురిని ఆ దుర్మార్గుడి కామాగ్నికి బలి చేసింది ఆ తల్లి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అమ్మ ఆస్పత్రిలో శనివారం అబార్షన్ కేసు విచారణలో ఈ దారుణాలు వెలుగు చూశాయి

నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు విభేదాలతో కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. భార్య తన కూతురితో కలిసి భువనగిరి జిల్లా ఘట్కేసర్ ప్రాంతంలో నివాసముంటోంది.ఈ క్రమంలోనే ఆమెకు మరిది వరుసయ్యే రాము అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. తల్లిని వలలో వేసుకున్న దుర్మార్గుడు ఈడుకొచ్చిన కూతురిపై కన్నేశాడు.

తల్లి ప్రొద్బలంతో దుర్మార్గుడు పలుమార్లు అత్యాచారం చేయడంతో గర్భం దాల్చిన బాలిక ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొద్దిరోజుల క్రితం అమ్మమ్మకు తెలిపింది. ఈ విషయం గుట్టు చప్పుడు కాకుండా తొర్రూరులోని అమ్మ ప్రైవేటు ఆస్పత్రిలో బాలికకు అబార్షన్ నిర్వహించారు.

బాలికకు అబార్షన్ జరిగిన విషయం చైల్డ్ లైన్కు ఫిర్యాదులు అందడంతో అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో తల్లి, ఆమె ప్రియుడి దారుణాలు వెలుగులోకి వచ్చాయి. అబార్షన్ నిర్వహించిన ఆస్పత్రి యాజమాన్యంపై, బాలికపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టిన రాము, అందుకు సహకరించిన బాలిక తల్లిపై అత్యాచారం, పోక్సో కేసులను నమోదు చేశారు పోలీసులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News