కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కు ప్రేమ్ సాయి అనే యువకుడు బలి అయ్యారు. ప్రేమ్ సాయి రెడ్డి అనే యువకుడు అప్పుల బాధతో తట్టుకోలేక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లో 8 లక్షల రూపాయలు పోగొట్టుకున్న ప్రేమ్ సాయి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా యువత బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకొని అప్పుల పాలై అల్లాడుతున్నారు.
కొంతమంది అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక ఊర్లు విడిచి పోవటమో లేక ఆత్మహత్య చేసుకోవటమో జరుగుతోంది. కాబట్టి ఇప్పటికి అయినా పోలీస్ అధికారులు బెట్టింగ్ భూతాలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
మరోవైపు ఇలాంటి ఘటనలపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నప్పుటికి యువతలో మార్పులు రావటం లేదు. ఇకనైనా ఈ ఉచ్చులో పడకూడదని కోరుకుందాం.