Begumpet accident: బేగంపేట ఫ్లైఓవర్‌పై బుధవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టగా.. అందులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
మితిమీరిన వేగమే కారణం: కారు అత్యంత వేగంగా ఉండటం వల్లే డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారు నడిపిన వ్యక్తి అక్కడ నుంచి తప్పించుకుని పరారయ్యాడు. గాయపడిన నలుగురిని స్థానికులు, పోలీసులు కలిసి తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది.
Also read-Road accident: విహారయాత్రలో విషాదం.. నాలుగు బస్సులు ఢీ.. 26 మందికి గాయాలు!
స్తంభించిన ట్రాఫిక్: ఫ్లైఓవర్‌పై కారు బోల్తా పడటంతో అటువైపుగా వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి.. పరారైన డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

