Tuesday, September 17, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: ఆ అధికారి తలచుకుంటే చనిపోయినోళ్లను బతికించేస్తాడు !

Karimnagar: ఆ అధికారి తలచుకుంటే చనిపోయినోళ్లను బతికించేస్తాడు !

ఆరేళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తి వచ్చి సంతకం..

ఒక అధికారి తలుచుకుంటే మృతి చెందిన వారిని బ్రతికున్నట్లు సృష్టిస్తాడు అనడానికి నిదర్శనం ఈ సంఘటన. కోట్ల విలువ చేసే భూమిపై కన్నేసిన ఒక వ్యక్తికి ఆ అధికారి అండదండలు ఉండడంతో ఆరేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి బ్రతికున్నట్లుగా సృష్టించి అతని పేరుపై ఉన్న ఒక ఎకరం ఏడు గుంటల వ్యవసాయ భూమిని సెల్ డిడి చేయడం విష్మయానికి కలిగిస్తుంది. ఒకటికి పది సార్లు రికార్డులను పరిశీలించాకనే భూ మార్పిడి చేస్తున్న అధికారులకు ఎప్పుడో మృతి చెందిన వ్యక్తి పేరు పై ఉన్న భూమిని అతని కుటుంబ సభ్యులకు తెలియకుండానే ఆ వ్యక్తి బతికున్నట్లు సృష్టించి సదరు భూమిని మరో వ్యక్తి పైకి బాధలాయింపు చేస్తున్నాడంటే ఏ స్థాయిలో అతను అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడో అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -

వివరాల్లోకి వెళితే… కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కొత్తపల్లి (హవేలి) లోని సర్వే నంబర్ 766/B విస్తీర్ణం ఒక ఎకరం ఏడు గుంటలు:1.0700 భూమి కొత్తపల్లి గ్రామానికి చెందిన భోగ నరసయ్య పేరున ధరణి లో నమోదయి ఉంది. భోగ నరసయ్య గత ఆరు సంవత్సరాల క్రితమే మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమారులు ఒకరు అటవీ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. మరొక్క కుమారుడు ఒక ప్రైవేట్ పాఠశాలో భాగస్వామి. మృతి చెందిన నరసయ్య కుమారులకు తెలియకుండానే అప్పటి తాహసిల్దార్ చల్ల శ్రీనివాస్ కొత్తపల్లికి చెందిన చింతల ప్రతాప్ రెడ్డికి సేల్ డిడి ద్వారా తేదీ.19-10-2022 రోజున రిజిస్ట్రేషన్ చేసి పట్టా పాస్ బుక్ No :T17100100179 జారీ చేశారు. అప్పటి తహసిల్దార్ చల్ల శ్రీనివాస్ అధికార దుర్వినియోగం చేసి ఉన్నత అధికారి డిజిటల్ సైన్ ధరణి ఆపరేటర్ల తో కుమ్మక్కై మృతి చెందిన నరసయ్య వచ్చి రిజిస్ట్రేషన్ చేసినట్టు నమోదు చేసి పట్టాదార్ పాస్ బుక్ లో ఎక్కించడం చూస్తుంటే అతడు ఏ స్థాయిలో తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడో అర్థం చేసుకోవచ్చు.

మృతి చెందిన వ్యక్తిని బ్రతికున్నట్లుగా సృష్టించి ఫోర్జరీ సంతకాలతో భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేసిన తహసిల్దార్ విధుల దుర్వినియోగంపై జిల్లా కలెక్టర్ స్పందించి పూర్తిస్థాయిలో విచారణ చేపడితే తాసిల్దారుగా చల్ల శ్రీనివాస్ విధులు నిర్వర్తించిన సమయంలో జరిగిన భూ అక్రమాలు వెలుగు చూచే అవకాశం ఉంది. మాజీ తహసిల్దార్ భూ అక్రమాలపై ఉన్నతాధికారులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూద్దాం…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News