Saturday, November 15, 2025
HomeTop StoriesAccident: కర్నూలులో మరో ప్రమాదం.. మూడు కార్లను ఢీకొట్టిన కంటైనర్

Accident: కర్నూలులో మరో ప్రమాదం.. మూడు కార్లను ఢీకొట్టిన కంటైనర్

Another accident in Kurnool: కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం మరువక ముందే అదే ప్రాంతంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్నటేకూరు – చెట్ల మల్లాపురం మధ్య జాతీయ రహదారిపై బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కంటైనర్ ట్రక్కు అదుపుతప్పి వరుసగా మూడు కార్లను ఢీకొట్టింది. కల్లూరు (మండలం) కొంగనపాడు ఫ్లై ఓవర్‌పై కంటైనర్‌ వెళ్తున్న సమయంలో.. ఓ కారు కంటైనర్‌ను క్రాస్ చేస్తూ ముందుకు వెళ్లింది. దీంతో వేగాన్ని నియంత్రించలేకపోయిన కంటైనర్ డ్రైవర్ ముందు వెళ్తున్న మూడు కార్లను బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో మూడు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. అయితే.. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

బిక్కుబిక్కుమంటున్న స్థానికులు: ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఒక్కసారిగా ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ.. కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అక్కడి స్థానికులు వెంటనే స్పందించారు. క్షతగాత్రులను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. చిన్నటేకూరు బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే ఈ ఘటన జరగడంతో స్థానికులు భయపడుతున్నారు. వారంలోనే రెండు మేజర్ ప్రమాదాలు ఒకటే ప్లేస్‌లో జరగడంతో.. అటుగా వెళ్తున్న ప్రయాణికులు చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు.

Also Read:https://teluguprabha.net/crime-news/married-woman-suicide-in-jagtial-district/

ప్రకాశం జిల్లాలో తప్పిన పెను ప్రమాదం: ప్రకాశం జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఈ రోజు ఉదయం ఆర్టీవీ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు కోమటికుంట దగ్గర అదుపుతప్పి ముళ్లకంపలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో కేవలం 8 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ప్రయాణికులు వేరే వాహనాలలో గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad