ఎస్‌ఎల్‌బీసీ(SLBC) టన్నెల్‌లో మరో మృతదేహం లభ్యమైంది. కన్వేయర్ బెల్ట్‌కు 50 మీటర్ల దూరంలో మృతదేహం(Dead Body) కనిపించింది. మినీ హిటాచితో మట్టి తీస్తుండగా ఈ డెడ్ బాడీ కనిపించింది. మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు వెలికితీస్తున్నారు.
ఇప్పటివరకు రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఆరుగురి కోసం SLBC టన్నెల్‌లో 32వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్మికుల ఆచూకీ గుర్తించేందుకే వేగంగా సహాయక చర్యలు చేపపడుతున్నారు.
టన్నెల్‌లో మట్టి, నీరు, టీబీఎం శకలాల తరలింపు చేస్తున్నారు. నిన్న SLBC సహాయక చర్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఆచూకీ దొరికే వరకు సహాయక చర్యలు కొనసాగాలని ఆదేశించారు.
సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించేందుకు.. సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాలని సీఎం తెలిపారు. నిపుణుల కమిటీ సూచనలతో ముందుకు వెళ్లాలన్నారు రేవంత్ రెడ్డి.