Thursday, March 6, 2025
Homeనేరాలు-ఘోరాలుAmerica: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి

America: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి

అగ్రరాజ్యం అమెరికా(America)లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో మరో తెలుగు విద్యార్థి తుపాకి తూటకు బలయ్యాడు. విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన ప్రవీణ్‌ తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. ఈ యువకుడు ఎంఎస్ చదువుతూ పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నాడు. రోజు విధుల్లో భాగంగా వెళ్తుండగా అడ్డగించిన దుండగలు జరిపిన కాల్పుల్లో ప్రవీణ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అగ్రదేశంలో ప్రవీణ్‌ మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబీకులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ప్రవీణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప రాఘవులు, రమాదేవి దంపతులకు ఇద్దరు సంతానం. కొడుకు ప్రవీణ్, కుమార్తె ఉన్నారు. అమెరికాలో ఉన్నత చదువుల కోసం ప్రవీణ్ వెళ్లారు. అంత బాగుందని తమ కొడుకు ప్రయోజకుడిగా ఎదుగుతుంటే ఆ కన్నతల్లిదండ్రుల సంతోషాలకు హద్దులు లేవు. ఇంతలోనే ఆ ఆనందం అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఆవిరైపోయింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తమ కుమారుడు ప్రవీణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని బుధవారం సాయంత్రం సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు,స్నేహితులు తల్లిడిల్లిపోయారు.

వీరి రోధించే తీరును చూసి చుట్టూ ప్రక్కల వారు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. తమ పిల్లలను
పై చదువుల కొరకు అమెరికా పంపించేవారు అక్కడే జరిగే పరిస్థితులను చూసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు పలువురు. ఘటనకు ముందు రోజు ప్రవీణ్ తమతో మాట్లాడాలని ఫోన్ చేశాడని రాత్రి కావటంతో నిద్రపోయామన్నారు తల్లిదండ్రులు. తిరిగి కాల్ చేస్తే లిప్ట్ చేయలేదని తెలిసిన వారి ద్వారా సమాచారం రావటం ప్రవీణ్ చనిపోయాడని తెలుసుకున్నామన్నారు. కొడుకు మృతితో ఇక మాకు దిక్కెవరంటూ ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రవీణ్ మృతదేహాన్ని స్వగ్రామానికి ఎప్పుడు తీసుకొస్తారనే విషయం తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News