కృష్ణాజిల్లా గుడివాడలో పాత గొడవలు భగ్గుమన్నాయి. గుడివాడ మార్కెట్ సెంటర్లో యువకుడిపై కత్తితో దాడికి పాల్పడ్డారు మరో యువకుడు. పుప్పాల పవన్ అనే యువకుడు పాత గొడవల నేపథ్యంలో మాంసం కొట్టే కత్తితో సిరిగిడి శ్రీనుపై దాడి(attack) చేశాడు.
- Advertisement -
శ్రీను ఎడమ చేతికి వీపు మీద బారి గాయలయ్యాయి. ఈ ఘటనతో మార్కెట్ సెంటర్లో ఉద్రిక్తత నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన శ్రీనును గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకోనున్నారు.