Sunday, December 8, 2024
Homeనేరాలు-ఘోరాలుAsifabad: పుష్ప స్టైల్లో గంజాయి స్మగ్లింగ్

Asifabad: పుష్ప స్టైల్లో గంజాయి స్మగ్లింగ్

ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నెట్వర్క్..

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సినీ ఫక్కీలో గంజాయిని తరలిస్తున్న కంటైనర్ ను పోలీసులు పట్టుకున్నారు. పుష్ప సినిమా తరహాలో పెద్ద మొత్తంలో తరలిస్తున్న భారీ పెద్ద మొత్తంలో గంజాయి పొట్లాలను తరలిస్తున్న వాహనాన్ని ఎట్టకేలకు ఆసిఫాబాద్ నుండి వెంబడించి వాంకిడి అంతరాష్ట్ర సరిహద్దులోని చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు.

- Advertisement -

జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ..రాజమండ్రి నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 290 కిలోల గంజాయిని సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అంతరాష్ట్ర సరిహద్దు అయిన వాంకిడి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద వాంకిడి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆసిఫాబాద్ వైపు నుండి మహారాష్ట్ర వైపు వాహనం, డ్రైవర్ అనుమానాస్పదంగా కల్పించడంతో అతన్ని విచారించి, లారీ కంటైనర్ తనిఖీ చేయగా 290 కేజీల 72 లక్షల 50 వేల రూపాయల విలువ చేసే గంజాయి లభ్యమైంది.

నిందితుడి నుండి 145 గంజాయి ప్యాకెట్స్, ఒక్కొక్కటి సుమారు రెండు కేజీల చొప్పున, మొత్తం 290 కిలోల బరువు , 72 లక్షల 50 వేల రూపాయల విలువ చేసే గంజాయి, ఒక లారీ కంటైనర్, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని, గంజాయి సరఫరా చేస్తున్న లారీ డ్రైవర్ ను అరెస్టు చేశామని, ఈ గంజాయి సరఫరాలో ముఖ్య నిందితుడు అయిన అరబింద్ ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందంను మధ్యప్రదేశ్ కు పంపినట్లు ఎస్పీ తెలిపారు.

ఈ సమావేశంలో ఆసిఫాబాద్ డిఎస్పీ కరుణాకర్, వాంకిడి సిఐ సత్యనారాయణ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ , ఆసిఫాబాద్ సీఐ రవీందర్ , వాంకిడి ఎస్ఐ ప్రశాంత్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News