Beheaded Body Of 17-Year-Old Girl Found In Jharkhand: జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో అత్యంత భయంకరమైన హత్య వెలుగు చూసింది. తల నరికి వేయబడిన 17 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ALSO READ: Couple Found Dead: లోపల గడియ పెట్టి ఉన్న ఇంట్లో దంపతుల మృతదేహాలు లభ్యం.. పెళ్లై ఏడాది కాకముందే..
బాధితురాలు సరియాహట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిఘి గ్రామానికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. గురువారం నాడు, మొండెం ఒక చోట, దానికి కొంత దూరంలో ఆమె తల వేరుగా లభించాయి.
సన్నిహితుల పనేనా?
సరియాహట్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ, “మా ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా కనిపిస్తోంది. బాధితురాలికి చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించాం” అని తెలిపారు.
ALSO READ: Girl Gang-Raped: స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా విద్యార్థిని కిడ్నాప్, సామూహిక అత్యాచారం!
ఈ కేసులో మరో విషయం ఏమిటంటే, బాధితురాలి తండ్రి నవంబర్ 4వ తేదీనే తన కూతురు కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కూతురిని ఇద్దరు యువకులు ఎత్తుకుపోయి ఉంటారని అనుమానిస్తూ వారి పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఇన్‌చార్జి తెలిపారు. ఆ ఫిర్యాదులోని అనుమానితుల కోణంలోనే పోలీసులు ఇప్పుడు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ALSO READ: Insurance Fraud: భర్త చనిపోయాడంటూ రూ. 25 లక్షల ఇన్సురెన్స్ డబ్బు పొందిన మహిళ.. ఎలా బుక్కైందంటే..


