గణతంత్ర దినోత్సవంనాడు భారత రాజ్యాంగం ప్రకారం మద్యం, మాంసం అమ్మకాలు పూర్తిగా నిషేధం. మద్యం అమ్మకాలు కొనసాగించిన, మద్యం దుకాణాలు తెరిచినా నిబంధనల్లో పేర్కొన్న విధంగా సదరు నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయి. అయితే అటువంటి నిబంధనలేమీ వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో కనిపించడం లేదు. యాలల మండల పరిధిలోని కోకట్ రోడ్డులో గల బెల్ట్ దుకాణాల్లో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి.
గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం మద్యం దుకాణాలు పూర్తిగా మూసేసినప్పటికీ యాలల మండల పరిధిలోని కూకట్ రోడ్డులో గల బెల్టు షాపులో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. సంబంధిత శాఖ అధికారులు ఆవైపు కన్నెత్తి చూడడం లేదు.
గణతంత్ర దినోత్సవం నాడు నిబంధనలు కఠినతరం చేయాల్సిన ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లుగా చూస్తున్నారని దేశభక్తులు మండిపడుతున్నారు. బెల్టు దుకాణాల యజమానులు గణతంత్ర దినోత్సవం నాడు మద్యం అమ్మకాలు కొనసాగిస్తూ రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తున్నారు.