Sunday, November 16, 2025
HomeTop StoriesBengaluru Student Yamini Murder Case : పెళ్లికి నో అంటే ప్రాణం తీసేశాడు! తల్లడిల్లిన...

Bengaluru Student Yamini Murder Case : పెళ్లికి నో అంటే ప్రాణం తీసేశాడు! తల్లడిల్లిన కన్నతల్లి మాటలివే!

Bengaluru Student Yamini Murder Case : బెంగళూరులోని శ్రీరంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. 20 ఏళ్ల బీఫార్మ్ స్టూడెంట్ యామిని ప్రియ (Yamini Priya)ను గొంతు, మొహంపై కత్తితో పొడిచి చంపిన యువకుడు విగ్నేష్ పెళ్లి అవకాశం తిరస్కరించినందుకు ప్రీ-ప్లాన్డ్ దాడి చేసినట్లు పోలీసులు తేల్చారు. స్నేహితుడు హరిష్ సహకారంతో ఈ హత్య జరిగినట్లు తెలుస్తుంది. ఇద్దరినీ సోలదేవనహల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యపై స్పందించిన తల్లి వరలక్ష్మి భావోద్వేగంతో వాడిని ఎన్కౌంటర్‌ చేసి చంపాలి అని డిమాండ్ చేశారు.

- Advertisement -

ALSO READ: Diwali 2025: దివాళీ ఆఫర్ల పేరుతో రూ.8 లక్షలు కాజేసిన కేటుగాళ్లు.. ఈ లింక్‌పై క్లిక్‌ చేస్తే బ్యాలెన్స్‌ మాయం..!

బెంగళూరు నార్త్ డివిజన్ DCP బీఎస్ నెమేగౌడా మీడియాకు మాట్లాడుతూ, “శ్రీరంపుర పోలీసులు అనుమానితులను ట్రాక్ చేశారు. యామిని బీఫార్మసీ స్టూడెంట్. విగ్నేష్ పెళ్లి ఒత్తిడి చేస్తూ, తిరస్కరణ తర్వాత కత్తితో దాడి చేశాడు” అని చెప్పారు. విగ్నేష్, హరిష్ (ఫాబ్రిక్ షాప్ ఉద్యోగి) అరెస్టు. “విగ్నేష్ మాత్రమే దాడి చేశాడు. హరిష్ సహకరించాడు.

ఇద్దరూ విచారణ భాగంగానే అరెస్ట్ చేశాము అని నెమేగౌడా తెలిపారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు, ప్రేమ సంబంధాలు అనుమానంగా పరిశీలిస్తున్నారు. యామిని ముందు విగ్నేష్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు విగ్నేష్‌ను హెచ్చరించి లాభం లేకపోయింది
యామిని తల్లి వరలక్ష్మి భావోద్వేగంగా మీడియాతో మాట్లాడారు. “అతన్ను ఎన్కౌంటర్‌లో చంపాలి. మొదటి ఫిర్యాదుకు పోలీసులు చేసినా అతన్ని వదిలేశారు. మేము అతని తల్లిదండ్రులు మంచివారని మౌనం పాటించాము. కానీ ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు” అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏప్రిల్‌లో విగ్నేష్ కుటుంబం పెళ్లి చేయమని అడిగింది. యామిని తిరస్కరించింది. “ఆమె అతన్ని ఇష్టపడలేదు. ఇష్టపడితే పెళ్లి చేసేదాన్ని” అని వరలక్ష్మి చెప్పారు. “మా కూతురు ఎవరితోనూ చెప్పలేదు. చదువు ఆపేస్తారని భయపడింది. కానీ చివరికి ఇలా జరిగింది… పొరుగింటి వారిని సైతం ఎప్పుడూ నమ్మెద్దు” అని భావోద్వేగంకు గురయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad