Woman Says Husband “Impotent”, Demands Rs 2 Crore: ఒక యువకుడు తన భార్యపై సంచలన ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించాడు. వివాహం జరిగిన మూడు నెలల తర్వాత తన లైంగిక సామర్థ్యంపై అనుమానం వ్యక్తం చేసి, వైద్య పరీక్షలకు బలవంతం చేసిందని, అంతేకాకుండా రూ. 2 కోట్ల పరిహారం డిమాండ్ చేసిందని ఆరోపిస్తూ ఆ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెంగుళూరులోని గోవిందరాజ్ నగర్‌కు చెందిన 35 ఏళ్ల ఈ యువకుడు, తన భార్య, ఆమె కుటుంబ సభ్యులపై దాడి, వేధింపుల ఆరోపణలతో కేసు పెట్టాడు.
ALSO READ: Woman Suicide: పరువు పోతుందని దాచితే ప్రాణం పోయింది.. అనాథలైన పిల్లలు!
ఈ యువకుడికి మే 5న వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత అతను తన భార్యతో కలిసి బెంగుళూరులోని సప్తగిరి ప్యాలెస్‌లో నివసిస్తున్నాడు. పెళ్లయిన మూడు నెలల తర్వాత, ఇంకా కాపురం చేయలేదని అతని భార్య అతని లైంగిక సామర్థ్యంపై అనుమానం వ్యక్తం చేసిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనితో తన భార్య బలవంతం మీద వైద్య పరీక్షలు చేయించుకోగా, తాను శారీరకంగా లైంగిక కార్యకలాపాలకు పూర్తిగా సమర్థుడినేనని వైద్యులు నిర్ధారించారని తెలిపాడు. మానసిక ఒత్తిడి కారణంగానే ఆలస్యం అవుతోందని వైద్యులు సలహా ఇచ్చారని పేర్కొన్నాడు.
ALSO READ: Girl Dies At School: పాఠశాలలో 6వ తరగతి విద్యార్థిని మృతి.. ‘న్యాయం’ కోసం తల్లి ఆవేదన
అయితే, ఈ విషయంపై వివాదం మరింత తీవ్రమైంది. 29 ఏళ్ల అతని భార్య, “వైవాహిక బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమయ్యాడు” అని ఆరోపిస్తూ భర్త నుంచి రూ. 2 కోట్ల పరిహారం డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో, ఆగస్టు 17న అతని భార్య తన బంధువులతో కలిసి గోవిందరాజ్ నగర్‌లోని తన ఇంటికి వచ్చి, తనపై, తన కుటుంబ సభ్యులపై దాడి చేసిందని ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటనతో బాధితుడు గోవిందరాజ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో తన భార్య, ఆమె బంధువులపై దాడి, వేధింపుల కింద ఫిర్యాదు నమోదు చేయించాడు. అంతేకాకుండా, బాధితుడు ఒక వీడియో ద్వారా తన భార్య బీజేపీ మీడియా విభాగంలో పనిచేస్తోందని, తనకు న్యాయం చేయాలని ఆ పార్టీకి విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: Husband stabs wife:కూతురి ముందే భార్యను పొడిచి చంపిన భర్త..!


