Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుEluru Accident: మరో ఘోర బస్సు ప్రమాదం.. ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడి ఇద్దరు మృతి

Eluru Accident: మరో ఘోర బస్సు ప్రమాదం.. ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడి ఇద్దరు మృతి

Eluru Accident Private Bus Two Died: ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఘటన మరువక ముందే ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న భారతి ట్రావెల్ బస్సు బోల్తా పడింది. లింగపాలెం మండలం జూబ్లీనగర్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకోగా ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/crime-news/man-kills-mother-after-she-tries-to-stop-him-from-beating-wife-in-up-cops/

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బస్సు బయలుదేరిన 20 నిమిషాలకే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad