Tuesday, July 2, 2024
Homeనేరాలు-ఘోరాలుBhupalapalli: రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్

Bhupalapalli: రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్

ఎట్టకేలకు రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దుల్లో గల సిరొంచ కేంద్రంగా గత పది సంవత్సరాలుగా అక్రమ సబ్సిడీ బియ్యం దందా చేస్తున్న బియ్యం మాఫియాకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భారీ షాక్ ఇచ్చారు.

- Advertisement -

700 క్వింటాళ్లు..

జిల్లా సంబంధిత అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని వారికి ప్రభుత్వ వేతనాల కంటే వేగంగా ముడుపులు అప్పజెప్పి మూడు ఉమ్మడి జిల్లాల నుండి నిరంతరం సబ్సిడీ బియ్యాన్ని తరలిస్తున్న మాఫియాపై ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు వ్యూహాత్మకంగా దాడి చేసి 700 కింటాళ్ల బియ్యాన్ని నాలుగు వాహనాలను సీజ్ చేశారు. పక్షం రోజుల క్రితం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు ఏకంగా ముడుపులు ఇచ్చేందుకు వెళ్లిన ఇసుక మాఫియా వీరయ్యను మందలించి పంపినట్లు ఎమ్మెల్యే స్వయంగా ప్రకటించడం విశేషం. స్వయంగా ఎమ్మెల్యేని ముడుపులతో ప్రసన్నం చేసుకునేందుకు బియ్యం మాఫియా ప్రయత్నించిందంటే ఏ మేరకు ఈ దందా నిరంతరం కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని సిరోంచ గ్రామం అక్రమ పిడిఎస్ బియ్యానికి క్యారఫ్ అడ్రస్ గా మారిందని ఎన్ని ఫిర్యాదులు వచ్చిన జిల్లా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుండి డిసిఎం వ్యాన్లలో అక్రమంగా సబ్సిడీ బియ్యాన్ని రవాణా చేస్తూ దళారులు కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్న విషయం ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలిసిందే.

మామూళ్లు-గ్రీన్ సిగ్నల్ ..ఇక్కడ రొటీన్ సీన్

అక్రమ రవాణాను నియంత్రించాల్సిన అధికారులు మామూళ్లకు అలవాటు అక్రమ రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది అధికారులు ప్రభుత్వం ఇచ్చే వేతనాల కంటే బియ్యం రవాణా చేసే అక్రమార్కులు ఇచ్చే ముడుపుల గురించి ఎదురు చూస్తారన్న ప్రచారం ఈ ప్రాంతంలో ఉంది. ప్రభుత్వ వేతనాల కంటే వేగంగా అధికారులకు అక్రమార్కులు ఎంత వేగంగా మూడులు ముట్ట చెబుతున్నరో అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు ఇచ్చే సబ్సిడీ బియ్యాన్ని 80 శాతం మంది లబ్ధిదారులు దళారులకు అమ్ముకుంటూ నగదు తీసుకుంటున్నారు. ఈ బియ్యాన్ని దళారులు సిరొంచలో ఉంటున్న ఒక రైస్ మిల్లర్ యజమానికి విక్రయించి వారి లాభం వారు తీసుకుంటున్నట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి.

సిరొంచి కేరాఫ్ రేషన్ బియ్యం

ఉమ్మడి వరంగల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడైనా పొరపాటున బియ్యం పట్టుపడితే తరలించేవారు సిరొంచ పేరు చెప్పడం షరా మామూలుగా జరుగుతోంది. ఇంత విచ్చలవిడిగా సబ్సిడీ బియ్యం సరిహద్దులు దాటి వెళుతున్నప్పటికీ, ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడంలేదు. మామూల్లో మత్తులో జోగుతున్న అధికారులు అక్రమార్కులకు తమ పూర్తి అండదండలు అందిస్తూ బియ్యం అక్రమ రవాణాకు ప్రోత్సహిస్తున్నట్లుగా ప్రచారం ఉంది. భారీ ఎత్తున జరుగుతున్న ఈ బియ్యం దందాపై మొట్టమొదటిసారి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేసి మాఫియాకు గట్టి షాక్ ఇచ్చారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు కళ్ళు తెరిచి బియ్యం అక్రమ రవాణాకు అడ్డు కట్టవేస్తారని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News