IIM KOLKATA RAPE CASE: కోల్‌కతాలో ఇటీవల కాలేజీ విద్యార్థినులపై అత్యాచారం కేసులు పెరుగుతుండటం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇటీవల నగరంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందనే వార్త పశ్చిమ బెంగాల్ రాజకీయాలను మరోసారి కుదిపేసింది. తాజాగా ఈ కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధితురాలి తండ్రి ఈ కేసుకు సంబంధించి సంచలన ప్రకటన చేశారు. అయితే తన కుమార్తెపై ఎలాంటి అత్యాచారం జరగలేదని చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బాధితురాలి తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి 9:34 గంటలకు తన ఫోన్ వచ్చిందని తెలిపాడు. తన కుమార్తె ఆటో నుంచి పడి స్పృహ కోల్పోయిందని ఫోన్‌లో అవతలి వ్యక్తి చెప్పాడని పేర్కొన్నాడు. వెంటనే ఆమెను SSKS ఆసుపత్రిలో చేర్చారని వివరించాడు. ప్రస్తుతం తన కుమార్తెకు చికిత్స జరుగుతోందన్నారు. ఆసుపత్రిలో తన కుమార్తెతో మాట్లాడనని.. తనపై ఎలాంటి అత్యాచరాం జరగలేదని ఆమె చెప్పిందని ఆయన వెల్లడించారు. దీంతో ఈ కేసు మరింత హాట్ టాపిక్ అయింది.
అసలు ఏం జరిగిందంటే.. కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో చదువుతున్న ఓ విద్యార్థిని కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతోంది. అయితే అదే కాలేజీలో చదువుతున్న మరో విద్యార్థి ఆమెకు మెంటల్ కౌన్సిలింగ్ ఇస్తానని చెప్పాడు. ఇందులో భాగంగా ఆ విద్యార్థిని బాయ్స్ హాస్టల్‌కు వెళ్లింది. అనంతరం అతడు ఇచ్చిన కూల్ డ్రింక్ తాగి మత్తులోకి జారుకుంది. తర్వాత స్పృహలోకి రాగానే తనపై అత్యాచారం జరిగిందని గ్రహించింది. ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. అయితే ఆ యువతి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read: దుస్తుల రూపంలో నోట్ల కట్టలా.. మంత్రి కవరింగ్ హాస్యాస్పదం
దీంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన గురించి బయటకు తెలియగానే బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రాష్ట్రంలో విద్యార్థినులపై అత్యాచరం ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయని ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో తన కుమార్తెపై అత్యాచారం జరగలేదని తాజాగా ఆమె తండ్రి చెప్పడం షాక్‌కు గురిచేస్తోంది. అసలు అత్యాచారం జరగనప్పుడు యువతి ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేసిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


