Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుschool girls dead: ఆలస్యంగా స్కూల్‌కి వెళ్లిన బాలికలు.. టీచర్ తిరిగి పంపిస్తే బావిలో శవాలుగా..

school girls dead: ఆలస్యంగా స్కూల్‌కి వెళ్లిన బాలికలు.. టీచర్ తిరిగి పంపిస్తే బావిలో శవాలుగా..

Bodies of 2 School Girls Found in Well: ఝార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో అత్యంత విషాదకర ఘటన జరిగింది. స్కూల్‌ నుంచి ఇంటికి పంపించిన ఇద్దరు బాలికల మృతదేహాలు ఓ బావిలో లభ్యం కావడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

ALSO READ: Gujarat Crime: గుజరాత్‌లో దారుణం: రూ.50 కోసం స్నేహితుడిని చంపిన యువకుడు..!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మృతులను జహీదా ఖాటూన్ (13), గులాబ్‌షా ప్రవీణ్ (14) గా గుర్తించారు. వీరు ఇద్దరూ సరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్‌గ్రేడెడ్ హైస్కూల్ చిరువా-కపిలోలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు.

బాగాదార్-సరియా ఎస్‌డిపిఓ ధనంజయ్ రామ్ ఈ ఘటన వివరాలను వెల్లడించారు. “గురువారం నాడు ఈ ఇద్దరు బాలికలు స్కూల్‌కు ఆలస్యంగా వచ్చారు. దీంతో, పాఠశాల ఉపాధ్యాయుడు వారిని తిరిగి ఇంటికి వెళ్లి, తమ సంరక్షకులను వెంటబెట్టుకుని రావాలని సూచించారు. ఆ టీచర్ మాట విని వారు స్కూల్ నుంచి బయలుదేరారు. కానీ, ఆ తర్వాత వారిద్దరూ ఒక బావిలో శవాలుగా కనిపించారు,” అని ఆయన తెలిపారు.

ALSO READ: Mallu Actor Controversy: మరో వివాదంలో సురేశ్ గోపి: మహిళతో దురుసు ప్రవర్తన..!

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనకు సంబంధించి బాలికల కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు తమకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు రాలేదని ఎస్‌డిపిఓ ధనంజయ్ రామ్ స్పష్టం చేశారు. అయితే, కుటుంబం నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేపడతామని ఆయన తెలిపారు.

ఇద్దరు స్కూలు బాలికలు బావిలో పడి చనిపోవడం వెనుక ఉన్న కారణాలు ఏమై ఉండవచ్చు అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. టీచర్ మందలించడంతోనే వారు మనస్తాపం చెందారా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.

ALSO READ: Woman Stabs Boyfriend: ప్రియుడిని కత్తితో పొడిచి చంపిన యువతి.. ఆ విషయంలో గొడవ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad