Bride’s Father Elopes With Groom’s Mother: సినిమా కథను తలపించే లాంటి వింత సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగింది. తమ పిల్లల నిశ్చితార్థానికి కొద్ది రోజుల ముందు, పెళ్లి కూతురు తండ్రి, పెళ్లి కొడుకు తల్లి పరారవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీంతో రెండు కుటుంబాలు తీవ్ర దిగ్భ్రాంతికి, పరువు నష్టానికి లోనయ్యాయి.
దాదాపు ఎనిమిది రోజుల క్రితం ఈ సంఘటన జరగ్గా, పోలీసులు గురువారం రోజున అదృశ్యమైన మహిళను గుర్తించారు.
ALSO READ: Child Abandonment: బ్యాగులో నవజాత శిశువు కుళ్లిపోయిన మృతదేహం లభ్యం.. తల్లిపై కేసు నమోదు
బంధుత్వం కాస్తా ప్రేమగా మారి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉంట్‌వాసా గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహిళ కనిపించడం లేదంటూ ఆమె కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా, పోలీసులు ఆమెను చిక్లీ గ్రామంలో గుర్తించారు. ఆమె అక్కడి 50 ఏళ్ల రైతుతో కలిసి జీవిస్తోంది. ఆ రైతు మరెవరో కాదు, ఆ మహిళ కొడుకుకు కాబోయే కోడలి (పెళ్లి కూతురు) తండ్రి!
పోలీసుల విచారణలో తేలిందేమిటంటే, చిక్లీకి చెందిన ఆ రైతు భార్య కొంతకాలం క్రితం చనిపోయింది. కాగా, వారి పిల్లల నిశ్చితార్థం కోసం జరుగుతున్న ఏర్పాట్ల మధ్య, కాబోయే వియ్యంకురాలు, వియ్యంకుడి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో వారు తమ కుటుంబాలను వదిలి, కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు.
ALSO READ: Honour Killing: దళిత టెకీ కవిన్ పరువు హత్య.. నిందితుడైన పోలీసు అధికారి బెయిల్ రద్దు
ప్రేమికుడిని వదలని మహిళ
ఈ విషయాన్ని టౌన్ ఇన్‌స్పెక్టర్ అశోక్ పటిదార్ ధృవీకరించారు. “45 ఏళ్ల మహిళ అదృశ్యంపై ఎనిమిది రోజుల క్రితం కేసు నమోదు చేశాం. ఆమె తన భర్తను, 18, 20 ఏళ్ల ఇద్దరు పిల్లలను వదిలి, తన కొడుకుకు కాబోయే కోడలి తండ్రితో వెళ్లిపోయినట్లు దర్యాప్తులో తేలింది. ఇద్దరూ కలిసి జీవించడానికి తమ ఇష్టాన్ని తెలియజేశారు” అని ఆయన వివరించారు.
పోలీసులు ఆమెను గుర్తించిన తర్వాత కూడా, ఆ మహిళ తన ప్రేమికుడిని వదిలి ఇంటికి రావడానికి నిరాకరించింది. తాను అతనితోనే ఉండాలనుకుంటున్నానని స్పష్టం చేసింది. కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తిరిగి రావాలని ఎంతగా బతిమాలినా, ఆమె తన నిర్ణయానికే కట్టుబడింది. ఈ పరిణామంతో రెండు కుటుంబాలు తీవ్ర అవమానానికి, దుఃఖానికి లోనయ్యాయి.
ALSO READ: Online Fraud: ‘గర్భవతి చేసే మగాడి కోసం ప్రకటన’.. నమ్మి రూ. 11 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి


