Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం మరువకముందే మరో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. మియాపూర్ నుంచి గుంటూరుకు వెళ్తున్న న్యూ గో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది.
- Advertisement -
ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వరుసగా బస్సు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.


