Homeనేరాలు-ఘోరాలుSiddipet: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు స్పాట్‌డెడ్‌!

Siddipet: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు స్పాట్‌డెడ్‌!

Car hits lorry: సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన ఒక కారు.. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

- Advertisement -

ప్రమాదానికి గల కారణాలు: స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదానికి గురైన కారు విపరీతమైన వేగంతో ప్రయాణిస్తోంది. కాగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్డు చాలా ఇరుకుగా ఉంది. అలాంటి చోట లారీని నిలిపి ఉంచడం.. దానికి తోడు కారు అతివేగం ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలని స్థానికులు తెలిపారు. లారీని గమనించే లోపే కారు నియంత్రణ కోల్పోయినట్లుగా తెలుపారు. దీంతో కారు లారీ వెనుక భాగంలోకి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.

Also read-Fire accident: ఏలూరులో అగ్నిప్రమాదం.. ఇద్దరు మహిళలు సజీవదహనం

రంగంలోకి దిగిన పోలీసులు: ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. మృతదేహాలను కారులో నుంచి బయటకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News