Friday, March 13, 2026
Homeనేరాలు-ఘోరాలుNalgonda: సాగర్ ఎడమ కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. దంపతుల గల్లంతు!

Nalgonda: సాగర్ ఎడమ కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. దంపతుల గల్లంతు!

Sagar left canal: నల్గొండ జిల్లాలోని నిడమానూరు మండలం ముకుందాపురం వద్ద శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి నాగార్జున సాగర్ ఎడమ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు.

- Advertisement -

ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు: త్రిపురారం మండలం కంపాసాగర్‌కు చెందిన పుల్లయ్య, పద్మ దంపతులు శనివారం వ్యక్తిగత పనుల నిమిత్తం మిర్యాలగూడకు వెళ్లారు. పని ముగించుకుని రాత్రి తిరిగి వస్తుండగా ముకుందాపురం సమీపంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న సాగర్ కాల్వలోకి పడిపోయింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ఉండగా డ్రైవర్ చాకచక్యంగా ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే వెనుక సీట్లో ఉన్న పుల్లయ్య, పద్మలు కారుతో సహా ప్రవాహంలో కొట్టుకుపోయారు.

Also read-Crime: ఇద్దరు బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య.. కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ నోట్!

కొనసాగుతున్న గాలింపు చర్యలు: ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కారును గుర్తించినప్పటికీ గల్లంతైన దంపతుల ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో ఆదివారం ఉదయం నుండి నిడమానూరు పోలీసులు, గజ ఈతగాళ్ల సహాయంతో కాల్వలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది. ఘటనా స్థలికి చేరుకున్న బాధితుల బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News