Chandanagar Jewellery Robbery : హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఖజానా జ్యువెల్లరీలో కలకలం చోటు చేసుకుంది. షాప్ లోకి దూసుకొచ్చిన దొంగలు బంగారం లాకర్ కీ ఇవ్వలేదనే కారణంతో మేనేజర్ పై కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
ALSO READ: https://teluguprabha.net/news/chandanagar-jewellery-robbery-attempt/
చందానగర్‌లో ఖజానా జ్యువెల్లరీ దుకాణంలో ఆరుగురు దుండగులు దోపిడీకి యత్నించి, కాల్పులు జరిపారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. దుండగులు తుపాకీతో సిబ్బందిని బెదిరించి, లాకర్ కీలు అడిగారు. కీలు ఇవ్వని సిబ్బందిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దాడిలో డిప్యూటీ మేనేజర్ కాలికి గాయమైంది. సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన దుండగులు, బంగారు ఆభరణాల స్టాల్స్‌ను విరగ్గొట్టారు.
సిబ్బంది ధైర్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను చూసి దుండగులు పరారయ్యారు. పోలీసులు నిందితులను పట్టుకునేందుకు పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు.
స్థానికుల్లో ఈ ఘటన భయాందోళనలు రేకెత్తించింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ, దుండగుల ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. చందానగర్‌లో భద్రతను పెంచేందుకు అదనపు పోలీసు బలగాలను మోహరించారు.


