Chemistry Professor Gets Life Term: తన భర్త మరణాన్ని సైన్స్‌తో ముడిపెట్టి, అది సహజ మరణమేనని నమ్మించేందుకు ప్రయత్నించిన ఓ కెమిస్ట్రీ ప్రొఫెసర్‌కు జీవిత ఖైదు పడింది. మధ్యప్రదేశ్‌లోని ఛతార్‌పుర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ కేసు స్థానికంగా సంచలనం సృష్టించింది. ఓ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేసిన మమత పాఠక్, తన భర్త డా. నీరజ్ పాఠక్ హత్య కేసులో దోషిగా తేలారు.
పోలీసుల వివరాల ప్రకారం, 2021 ఏప్రిల్‌లో జూలైలో డా. నీరజ్ పాఠక్ ఇంట్లోనే అనుమానాస్పదంగా చనిపోయారు. మొదట్లో దీన్ని సాధారణ మరణంగానే అంతా భావించారు. పోస్టుమార్టంలో అది హత్యగా తేలింది. దీంతో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు మమత పాఠక్‌ను అరెస్టు చేశారు. దీనిపై ఆమెకు జీవిత ఖైదు శిక్ష పడింది.
అయితే కోర్టులో సైన్స్ సూత్రాలు చెప్పి కోర్టును తప్పుదోవపట్టించే ప్రయత్నం చేసింది మమత. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆపై అప్పీల్ చేయగా తాజాగా హైకోర్టు సైతం ఆమె శిక్షను సమర్థించింది.


