మండలం గుర్జకుంట గ్రామంలో సిద్దిపేట పోలీస్ కళాబృందం ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమం చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించారు. చేర్యాల సిఐ సత్యనారాయణ రెడ్డి,సిద్దిపేట ట్రాఫిక్ సిఐ రామకృష్ణ,కనువిప్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేర్యాల సిఐ సత్యనారాయణ రెడ్డి, సిద్దిపేట ట్రాఫిక్ సిఐ రామకృష్ణ మాట్లాడుతూ.. సామాజిక రుగ్మతలు, సమాజంలో జరుగుతున్న మంచి చెడులు, బాలికలు, మహిళల రక్షణ చట్టాలు, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు, ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
వాట్స్అప్ లలో అనుమానాస్పదంగా వచ్చే బ్లూ కలర్ మెసేజ్లను క్లిక్ చేయకూడదని సైబర్ నేరం జరిగిన వెంటనే NCRP. పోర్టల్ (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయడం బాధితులకు ఉన్న ఒకే ఒక గొప్ప ఆయుధమని,టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100, 112 లకు కాల్ చేయాలని, తదితర అంశాల గురించి ఎల్ఈడి స్క్రీన్ వీడియో మరియు ఆడియో ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
ఆన్లైన్ అప్పు ఎప్పుడైనా ముప్పే..
ఆన్లైన్లో లోన్ తీసుకొని ఇబ్బందులకు గురి కావద్దని పోలీసులు ప్రజలకు తెలియజెప్పారు. లోన్ తీసుకున్న తర్వాత లోను కట్టేటప్పుడు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారన్నారు. చిన్న చిన్న తగాదాలకు పోయి జీవితం నాశనము చేసుకోవద్దన్నారు.
Cheryala: సిద్దిపేట పోలీసు ”కనువిప్పు”
సంబంధిత వార్తలు | RELATED ARTICLES